WhatsApp నుండి ఒక వ్యక్తిని ఇన్ని రకాలుగా బ్లాక్ చేయవచ్చా.!

WhatsApp నుండి ఒక వ్యక్తిని ఇన్ని రకాలుగా బ్లాక్ చేయవచ్చా.!
HIGHLIGHTS

వాట్సాప్ లో మీకు నచ్చని వారిని పక్కన పట్టేందుకు వీలుంది

అవతలి వ్యక్తిని సమయానుకూలంగా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది

పాక్షికంగా బ్లాక్ చెయ్యాలనుకుంటే మాత్రం మూడు మార్గాలున్నాయి

WhatsApp గురించి తెలియని స్మార్ట్ ఫోన్ యూజర్ ఉండరు, అంటే పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయమేమి కాదు. ఎందుకంటే, స్మార్ట్ ఫోన్ రాగానే ముందుగా వచ్చి చేరే యాప్ వాటప్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతగా ఈ ఇన్స్టాంట్ మెసేజింగ్ అప్లికేషన్ పాతుకు పోయింది. చాటింగ్, వీడియో, ఫోటోలు మొదలు కొని అన్ని పనులకు వాట్సాప్ వేదిక అవుతుంది. అయితే, వాట్సాప్ లో మీకు నచ్చని వారిని పక్కన పట్టేందుకు కూడా వీలుంది. యూజర్ సెక్యూరిటీని దృష్ఠిలో ఉంచుకొని కొన్ని సేఫ్టీ మరియు సెక్యూరిటీ ఫీచర్లను వాట్సాప్ అందించింది. అందులో, అకౌంట్ బ్లాక్ కూడా ఒకటి మరియు చాలా ఉపయోగమైనది.

WhatsApp కాంటాక్ట్ బ్లాక్

వాట్సాప్ అకౌంట్ నుండి ఇక యూజర్ అనేక ఫీచర్స్ ద్వారా అనేక పనులను చేస్తుంటారు. అకౌంట్ డిస్ప్లే పిక్చర్ (DP) మొదలుకొని స్టేటస్, పర్సనల్ ఫోటోలు మరియు వీడియోలు షేరింగ్ వంటి పనులు చేస్తుంటారు. అయితే, కాంటాక్ట్ లిస్ట్ లో ఫ్రీ ఒక్కరికి మీ పర్సనల్ వీడియోలు, స్టేటస్ లేదా ఫోటోలకు యాక్సెస్ ను అందించడం కొంత మందికి ఇష్టం ఉండక పోవచ్చు. అటువంటి సమయంలో అవతలి వ్యక్తిని సమయానుకూలంగా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది.

Whatsapp logo
వాట్సాప్ అకౌంట్

ఇందులో నాలుగు రకాలుగా ఒక వ్యక్తిని వాట్సాప్ అకౌంట్ నుండి బ్లాక్ చేసే వీలుంది. వీటిలో అత్యంత సులభమైన మరియు ప్రధమ పద్దతి అవతలి వ్యక్తి నెంబర్ ను బ్లాక్ చెయ్యడం. ఇలా చెయ్యడం ద్వారా అవతలి వ్యక్తిని పూర్తిగా బ్లాక్ చెయ్యగలుతారు. ఒకవేల పాక్షికంగా బ్లాక్ చెయ్యాలనుకుంటే మాత్రం మూడు మార్గాలున్నాయి.

Also Read : Lava Yuva 3 Pro: కొత్త ఫోన్ లాంచ్ డేట్ చేసిన లావా.. ఫీచర్స్ లీక్ చేసిన లీక్ స్టర్లు.!

అవతలి వ్యక్తి మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాట్సాప్ అకౌంట్ స్టేటస్ ను చూడకుండా బ్లాక్ చేయవచ్చు. అంటే, వాట్సాప్ అకౌంట్ స్టేటస్ నుండి షేర్ చేసిన ఫోటోలు మరియు విడిలను మీరు బ్లాక్ చేసిన వ్యక్తి చూసే అవకాశం ఉండదు. మీకు నచ్చిన లేదా మీరు ఎరికైతే మీ వాట్సాప్ స్టేట్స్ ను చూసే అవకాశం ఇస్తారో వారు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.

Whatsapp logo
వాట్సాప్ అకౌంట్

ప్రొఫైల్ ఫోటో బ్లాక్ చెయ్యడం కూడా పాక్షికంగా బ్లాక్ చేయడంలో ఒక పద్దతి. ఇందులో మీరు అవతలి వ్యక్తి మీ అకౌంట్ ప్రొఫైల్ ఫోటో లేదా వాడుక భాషలో డిస్ప్లే పిక్చర్ (DP) ని చూసే అవకాశం లేకుండా చేయవచ్చు. ఇక మూడవ పాక్షిక పడతి లాస్ట్ వ్యూ బ్లాక్ చెయ్యడం. ఇలా చేయడం ద్వారా మీరు ఆన్లైన్ ఉన్నా కూడా ఎవరికి తెలియకుండా చేసే వీలుంటుంది.

ఈ విధంగా మీరు అవతలి వ్యక్తిను మీ సమయానుకూలంగా నాలుగు పర్మినెంట్ గా లేదా పాక్షికంగా బ్లాక్ చేసే వీలుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo