Whatapp: మే 15 తరువాత మీ వాట్స్అప్ అకౌంట్ పరిస్థితి ఏంటో తెలుసా?
వాట్స్అప్ కొత్త ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చెయ్యలేదా
మీ వాట్స్అప్ అకౌంట్ డిలీట్ అవుతుందా
మే 15 తరువాత మీ వాట్స్ అప్ అకౌంట్ ఎలా భవిష్యత్ ఏమిటి
మే 15 నాటికీ వాట్స్అప్ యొక్క కొత్త ప్రైవసి పాలసీలను యాక్సెప్ట్ చెయ్యమని తన వినియోగదారులను కోరుతోంది. అలాగే, ఈ కొత్త పాలసీలను యాక్సెప్ట్ చెయ్యని యూజర్స్ అకౌంట్ కి సంభందించి ఎటువంటి మార్పులు జరగున్నాయో కూడా వివరించింది. అయితే, కొత్త ప్రైవసి పాలసీలను యాక్సెప్ట్ చెయ్యకపోయినా కూడా అకౌంట్ మాత్రం డిలీట్ అవ్వదని వాట్స్అప్ స్పష్టం చేసింది. కానీ, వాట్స్అప్ యూజర్లు కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవలసి వస్తుందని వెల్లడించింది.
నిరంతర రిక్వెస్ట్ మెసేజీలు
Whatsapp కొత్త ప్రైవసి పాలసీలను యాక్సెప్ట్ చేయని వారిని, పూర్తిస్థాయి సేవలతో వాట్స్అప్ అకౌంట్ కోసం మే 15 వరకూ యాక్సెప్ట్ చెయ్యమని కోరుతుంది. అప్పటికి కూడా కొత్త పాలసీలను యాక్సెప్ట్ చేయని వారికీ నిరంతరంగా రిక్వెస్ట్ మెసేజీలు పంపుతుంది మరియు కొన్ని సేవలను నిలిపి వేస్తుంది. వీటిలో, కొత్త పాలసీలను యాక్సెప్ట్ చెయ్యని వారు, తమ వాట్స్అప్ నుండి మెసేజిలను పంపడం లేదా చదవడం వంటివి చేయలేరు.
ఒక్కో సర్వీస్ కోల్పోతారు
కొన్ని రోజుల వరకూ కాల్స్ మరియు నోటికేషన్లకు అవకాశం ఇస్తుంది. కానీ, ఎప్పుడైనా ఆ సర్వీసులను కూడా నిలిపి వేసే అవకాశం ఉందని కూడా తెలిపింది. అంటే, ఒక విధంగా చూస్తే కొత్త ప్రైవసీ పాలసీ లను యాక్సెప్ట్ చేయని వినియోగదారులకు వారి అకౌంట్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం కోల్పోతారు. అర్థమయ్యేలా చెప్పాలంటే, పొమ్మని చెప్పకుండా పొగపెడుతుందన్న మాట.