వాట్స్ అప్ లో కొత్త ఫీచర్స్ వస్తున్నాయి – ఏప్రిల్ 28

Updated on 28-Apr-2016

ఫేస్ బుక్ కంపెని కాల్ బ్యాక్, వాయిస్ మెయిల్ అండ్ జిప్ ఫైల్స్ షేరింగ్ అనే మూడు ఫీచర్స్ ను వాట్స్ అప్ లో యాడ్ చేస్తున్నట్లు ఫోన్ రాడార్ సైట్ వెల్లడించింది.

కాల్ బ్యాక్ అనేది నోటిఫికేషన్ బార్ లో ఉండే వాట్స్ అప్ బటన్ ద్వారా పనిచేస్తుంది. అంటే మీకు ఎవరైనా వాట్స్ అప్ లో missed కాల్ ఇస్తే ఆ నోటిఫికేషన్ తో పాటు ఈ బటన్ కూడా ఉంటుంది అక్కడ..

నోటిఫికేషన్ పై టాప్ చేస్తే యాప్ ఓపెన్ అవటం ఉంది ఇప్పటివరకు, ఇక నుండి తిరిగి వాళ్ళకు కాల్ చేయటానికి యాప్ ను ఓపెన్ చేయనక్కర్లేకుండా కాల్ బ్యాక్ use అవుతుంది.

ఇక వాయిస్ మెయిల్ అనేది వాట్స్ అప్ యూసర్ ఆల్రెడీ కాల్ లో ఉన్నప్పుడు పనిచేస్తుంది. ఇది ముందుగా ఐos లోకి రానుంది రిపోర్ట్స్ ప్రకారం.

ఇంకా డాకుమెంట్స్ తరువాత ఇప్పుడు .zip ఫైల్స్ ను కూడా సపోర్ట్ చేయనుంది వాట్స్ అప్. అంటే ఎక్కువ సైజ్ ఫైల్స్ ను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోగలము ఇక నుండి.  

ఇవన్నీ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉన్నాయి అని అప్ డేట్. ఎప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తాయో ఇన్ఫర్మేషన్ లేదు. వాట్స్ అప్ పై గతంలో చేసిన ఆర్టికల్స్ ను ఈ క్రింది లింక్ లో చూడగలరు..

1. వాట్స్ అప్ లో text formatting ఫీచర్స్ ను ఎలా use చేయాలి
2. 
వాట్స్ అప్ లో అందరూ తెలుసుకోవలసిన చాలా ఇంపార్టంట్ విషయాలు
3. వాట్స్ అప్ లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ [ఏప్రిల్ 2016]
4. డిలిట్ అయిన వాట్స్ అప్ మెసేజెస్ ను ఇలా పొందగలరు

 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :