“Mark as Unread” తో సహా మరిన్ని ఫీచర్స్ తో WhatsApp అప్ డేట్

“Mark as Unread” తో సహా మరిన్ని ఫీచర్స్ తో WhatsApp అప్ డేట్
HIGHLIGHTS

మోస్ట్ వాంటెడ్ ఫీచర్స్

రోజు రోజుకి instant messaging అప్లికేషన్స్ కు మార్కెట్ పెరుగుపోతుంది. వివిధ కంపెనీలు వీటి పై ఆధారపడి ఉండటం వలన వీటికి తరుచుగా యూజర్స్ కు నచ్చే ఫీచర్స్ ను ఇవ్వటానికి కంపెనీలు పోటీ పడుతున్నారు. ఇందుకు ఉదాహరణలే ఫేస్ బుక్ మెసెంజర్, వాట్స్ అప్, టెలిగ్రాం, స్కైప్. 

లేటెస్ట్ గా ఇప్పుడు వాట్స్ అప్ లో కొన్ని మంచి ఉపయోగకరమైన ఫీచర్స్ వచ్చాయి. మీరు ఒక మెసేజ్ చదివి దానిని మళ్ళీ "Mark as unread" అనే ఫీచర్ ద్వారా బ్లూ టిక్ మార్క్స్ అవతల వ్యక్తికి కనపడకుండా మెసేజ్ చదవనట్టు చేయవచ్చు. మీకు మాట్లాడే తీరిక లేనప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.  

ఇది ఫేస్ బుక్ డెస్క్ టాప్ వెర్షన్ లో మరియు స్టాండర్డ్ email సిస్టం లో ఉండేది. ఇప్పుడు ఫస్ట్ టైమ్ వాట్స్ అప్ ఈ ఫీచర్ ను instant messaging యాప్స్ కు తెచ్చింది. ఈ ఫీచర్ ను enable చేయటానికి చాట్ విండోస్ లోని ఉన్న కాంటాక్ట్ మీద లాంగ్ క్లిక్ చేస్తే "Mark as unread" ఆప్షన్ కనపడుతుంది.

అలాగే Custom notifications ఆప్షన్ ద్వారా నచ్చిన కాంటాక్ట్ కు నచ్చిన నోటిఫికేషన్ టోన్, వైబ్రేషన్ మోడ్, పాప్ అప్ నోటిఫికేషన్, కస్టం లైట్ ఇండికేటర్, కాల్ రింగ్ టోన్ పెట్టుకోగలరు. అన్నిటికి మించి మీకు నచ్చని కాంటాక్ట్ ను mute ఆప్షన్ ద్వారా గ్రూప్స్ ను సైలెంట్ లో పెట్టినట్టే పెట్టుకోగలరు. ఈ ఆప్షన్ enable చేయటానికి మీరు కాంటాక్ట్ మీద లాంగ్ క్లిక్ చేస్తే, Custom Notifications మరియు Mute అనే ఫీచర్స్ కనిపిస్తాయి. వాటి లోపలికి వెళ్లి మీకు నచ్చిన విధంగా సెట్టింగ్ చేసుకోగలరు.

మీరు వాట్స్ అప్ కాలింగ్ లో ఉన్నపుడు లో ఇంటర్నెట్ స్పీడ్ కనెక్షన్ (2G) లో ఉంటే, కాల్ క్వాలిటీ దానికి అనుగుణంగా ఉండేలా Low data Usage ఆప్షన్ కూడా జోడించింది. ఇది ఏక్సిస్ చేయటానికి మెయిన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Chats and Calls ఆప్షన్ లోకి వెళ్లి, క్రిందకు స్క్రోల్ చేస్తే కాల్ సెట్టింగ్స్ మెను క్రింద కనపడుతుంది.

ప్రస్తుత ప్లే స్టోర్ వాట్స్ అప్ వెర్షన్ 2.12.176. ఈ వెర్షన్ లో ఇంకా ఈ ఫీచర్స్ రాలేదు. Version 2.12.197 లో మాత్రమే వీటిని పొందగలరు. ప్లే స్టోర్ అప్ డేట్ రాకముందే మీరు ఈ ఫీచర్స్ ను ఏక్సిస్ చేయటానికి ఈ లింక్ లో ని అఫిషియల్ వాట్స్ అప్ వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకొని, ఇంస్టాల్ చేసి వాడుకోగలరు.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo