చైనా Apps నిషేదం పైన వైరల్ అవుతున్న మెసేజ్ పైన ఘాటుగా స్పందించిన ప్రభుత్వం
Google Play Store మరియు Apple App స్టోర్లలో లిస్ట్ చేయబడిన కొన్ని "చైనీస్ అప్లికేషన్స్" ను భారత ప్రభుత్వం అధికారికంగా నిషేధించిందని పేర్కొంటూ ఇంటర్నెట్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో విపరీతంగా వైరల్ అవుతున్న Viral Message
ఇంటర్నెట్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో విపరీతంగా వైరల్ అవుతున్న Viral Message ఇప్పుడు PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫాక్ట్ చెక్ వింగ్ ద్వారా ఖండించబడింది.
ఈ మెసేజి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) నుండి వచ్చిన అధికారిక ఉత్తర్వులాగా ఉంది
ఇప్పుడు Wahatsapp లో ఎక్కడ చూసిన చైనా యాప్స్ ని ప్రభుతం బ్యాన్ చేసినట్లు మరియు అందరిని చేయమన్నట్లు, అదికూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లు ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. ఈ వైరల్ మెసేజ్ అత్యధికంగా షేర్ చేయబడిన మెసేజిగా కూడా చెప్పబడుతోంది.
అయితే, Google Play Store మరియు Apple App స్టోర్లలో లిస్ట్ చేయబడిన కొన్ని "చైనీస్ అప్లికేషన్స్" ను భారత ప్రభుత్వం అధికారికంగా నిషేధించిందని పేర్కొంటూ ఇంటర్నెట్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో విపరీతంగా వైరల్ అవుతున్న Viral Message ఇప్పుడు PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫాక్ట్ చెక్ వింగ్ ద్వారా ఖండించబడింది.
Claim: A viral message of an order allegedly from NIC claims that @GoI_Meity has prohibited some apps from being made available on App Stores. #PIBFactCheck: The Order is #Fake. No such instruction has been given by @GoI_MeitY or NIC. pic.twitter.com/Dt7rMR7nIz
— PIB Fact Check (@PIBFactCheck) June 19, 2020
ఈ ఆరోపించడిన ఉత్తర్వు, ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ మరియు గూగుల్ మరియు ఆపిల్ ఇండియా రెండింటి ప్రతినిధులను ఆయా యాప్ స్టోర్స్ నుండి మొత్తం 14 యాప్స్ ను రిస్ట్రిక్ట్ చేయాలని నిర్దేశిస్తుంది. ఈ జాబితాలో TikTok, Club Factory, Clash of Kings, CamScanner, Game of Sultans, LiveMed, Bigo Live, Vigo Video, Beauty Plus, Mobile Legends, Shein, Romwe, AppLock మరియు VMate వంటి యాప్స్ ఉన్నాయి.
అధికారిక PIB Fact Check హ్యాండిల్ నుండి వచ్చిన ట్వీట్ ఈ ఆర్డర్ పూర్తిగా నకిలీదని పేర్కొంది. ప్రస్తుత చైనా వ్యతిరేక భావాల మధ్య, ఇటువంటి సందేశాలు ఇంటర్నెట్ మరియు వాట్సాప్ గ్రూపులలో కూడా విచ్చలవిడిగా షేర్ అవుతున్నాయి, ఇవి చైనా ఆధారిత Apps పైన చర్య తీసుకోవడానికి ప్రజలను ప్రభావితం చేస్తాయి. ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదా అధికారిక మీడియా ద్వారా వస్తే తప్ప, ఇటువంటి మెసేజ్ లను నమ్మవద్దని, మేము మా పాఠకులకు సలహా ఇస్తున్నాము.
ఇటీవల, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 52 యాప్‌ల జాబితాను భారత ప్రభుత్వానికి పంపాయని ఆరోపించారు, ఈ యాప్‌ల వాడకానికి వ్యతిరేకంగా అధికారిక సలహా ఇవ్వమని సూచించారు. భారతదేశంలో ఈ ఆండ్రాయిడ్ మరియు iOS యాప్స్ వాడకంపై సెక్యూరిటీ మరియు ప్రైవసీ సమస్యలను ఏజెన్సీలు ఉదహరించాయి. కానీ, ఈ యాప్స్ వాడకాన్ని గురించి ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేయలేదు మరియు చైనీస్ మూలాలను కలిగిన యాప్స్ ను తొలగించమని యాప్ స్టోర్లను సూచించలేదు.