నిమిషానికి 19 పైసల కాల్ చార్జ్ ను ఇండియాలో ప్రవేశ పెట్టింది Ringo యాప్. ఇది ఇండియాలో ఏవరికైనా ఇంటర్నెట్ పై కాల్ కాకుండా సిమ్ నెట్వర్క్ తోనే కాలింగ్ చేసే యాప్. ఈ యాప్ ఎందుకు ఇంత పాపులర్ అయ్యిందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో చదవండి.
అయితే దీని పై ఇండియన్ టెలికాం నెట్వర్క్స్ ఆగ్రహం చెందారు. Ringo చీప్ కాలింగ్ ప్లాన్ అనౌన్స్ చేసిన రెండు రోజుల్లో, టెలికాం ఆపరేటర్లు తమ నెట్ వర్క్స్ పై రింగో సర్విస్ ను బ్లాక్ చేయటం జరిగింది.
రింగో దీనిపై స్పందిస్తూ.." కొన్ని టెలికాం నెట్ వర్క్స్ మమ్మల్ని బ్లాక్ చేసినట్టు తెలిసింది. సో దీనిపై స్పందించి త్వరలోనే మళ్ళీ రింగో domestic కాల్ సర్విస్ ను స్టార్ట్ చేస్తాము" అని చెప్పింది.
రింగో సర్విస్ అన్ని లీగల్ విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ సర్వీస్ స్టార్ట్ చేసింది. దీని పై DOT అండ్ TRAI తో వర్క్ చేసి సర్వీస్ ను మళ్ళీ స్టార్ట్ చేయనుంది త్వరలోనే. రింగో లో కేవలం ఇండియన్ లోకల్ కాల్స్ మాత్రమే పనిచేయటం లేదు, ఇంటర్నేషనల్ కాల్స్ వర్క్ అవుతాయి.