వాట్స్ అప్ మరొక అప్ డేట్ రిలీజ్ చేసింది. ఇది గ్రూప్స్ కు సంబంధించినది. సో మీరు ఏదైనా గ్రూప్ కు యాడ్ అవ్వాలంటే ఆ గ్రూప్ యొక్క అడ్మిన్ మీ ఫోన్ నంబర్ తన ఫోన్ లో సేవ్ చేసుకొని…
వాట్స్ అప్ ఓపెన్ చేసి మీ కాంటాక్ట్ ను సర్చ్ చేసి, మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేసే పరిస్థితి ఉండేది ఇప్పటివరకూ. ఇప్పటి నుండి ఇక ఇదంతా చేయనవసరం లేదు.
ఒక గ్రూప్ క్రియేట్ అయిన వెంటనే, గ్రూప్ కు అంటూ ఒక invite లింక్ క్రియేట్ చేస్తుంది వాట్స్ అప్. ఆ లింక్ ను యాడ్ అవదలచుకున్న వ్యక్తి కి షేర్ చేస్తే చాలు.
ఆ లింక్ పై అతను క్లిక్ చేస్తే ఆటోమాటిక్ గా గ్రూప్ లో యాడ్ అవటం జరుగుతుంది. సో ఇది పర్సనల్ ఫ్యామిలీ గ్రూప్స్ లో అయితే అంతగా useful గా ఉండకపోవచ్చు(ఫెమలీ మెంబెర్స్ నంబర్స్ అడ్మిన్ ఫోనులోఉంటాయి కనుక..)
కానీ ఫోన్స్, లేదా ఫాన్స్ కు సంబంధించిన పబ్లిక్ గ్రూప్స్ కు బాగా useful ఉంటుంది. అంటే అడ్మిన్ కు యాడ్ అవుదామని అనుకునే వ్యక్తి తెలియనప్పుడు..
గ్రూప్ లింక్ ను డెస్క్ టాప్ బ్రౌజర్ లో కూడా ఓపెన్ చేయగలరు. ఓపెన్ చేసిన వెంటనే యాడ్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఆండ్రాయిడ్ అండ్ iOS users కు పనిచేస్తుంది.
ఆల్రెడీ బీటా users కు అప్ డేట్ రోల్ అయ్యింది. బీటా user అవ్వాలంటే ఈ లింక్ లో తెలిపినట్లు చేయగలరు. ఈ సందర్భంగా ఎంతమంది డిజిట్ తెలుగు వాట్స్ అప్ గ్రూప్ కు వోటు వేస్తారు అనేది ఫేస్ బుక్ కామెంట్స్ లో మాకు తెలియజేయగలరు.