"I am Varun Pulyani, director of whatsapp" అనే సారంశం తో ఒక మెసేజ్ వాట్స్ అప్ గ్రూప్స్ లో బాగా హాల్ చల్ చేస్తుంది. దీనిలో వాట్స్ అప్ ను అంబానీ కు అమ్మేసినట్లు, ఈ మెసేజ్ ను 10 మందికి షేర్ చేస్తే ఫ్రీ గా వాడుకోగలరు లేదంటే వాట్స్ అప్ వాడటానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని మరియు ఒక spam లింక్ ను ఇచ్చి దానిపై క్లిక్ చేస్తే ఫేస్ బుక్ కు కనెక్ట్ అవగలరు అనే విషయాలు వ్రాసి ఉన్నాయి.
అయితే ఆ మెసేజ్ లో ఎటువంటి నిజాలు లేవు. ఇంకా ఇలాంటివి నమ్మే users ఉన్నారని ఆశించటం లేదు. ఉన్నా, వారి సంఖ్య నెమ్మదిగా తగ్గుతుంది అనే అంచనా. సో మీరు కేవలం ఆ మెసేజ్ కొట్టి పారేయటమే కాదు దానిలో ఉండే ప్రమాదపు హానికర లింక్ కూడా ఉందని గ్రహించి మెసేజ్ డిలిట్ చేసి ఇతరులకు ఈ స్టోరీ షేర్ చేయండి లేదా చెప్పండి.
ఒక వేల వాట్స్ కంపెని కనుకు నిజంగా అంబానీ కు అమ్మితే ఇద్దరిలో ఎవరో ఒకరైనా ప్రెస్ రిలీజ్ చేస్తారు. ఇలా చీప్ గా వాట్స్ అప్ మెసేజ్ ల ద్వారా సందేశాలు ఇవ్వరు అనే సింపుల్ లాజిజ్ అందరికీ అవగాహన ఉంటుంది అనే అనుకుంటున్నాము.