వాట్స్ అప్ ను ఫేస్ బుక్ కొన్న దగ్గర నుండీ చాలా అప్ డేట్స్ ను ఇస్తుంది. నెలకు ఒక ఫీచర్ తో users కు బోర్ కొట్టకుండా ఉంది. కాని వాట్స్ అప్ పెయిడ్ సర్వీస్ మాత్రం నెక్స్ట్ ఇయర్ నుండీ ఖచ్చితంగా అవుతుంది అని రిపోర్ట్స్.
ఇప్పుడు లేటెస్ట్ గా దీనిలో వీడియో కాలింగ్ రానుంది అని న్యూస్. ఇప్పటికే ఆడియో కాలింగ్ ఇస్తుంది. తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ కలిగిన ఫోన్స్ లో మంచి ఆడియో కాలింగ్ చేయటానికి సెట్టింగ్స్ లో Low డేటా కాలింగ్ ఆప్షన్ కూడా ఇచ్చింది.
ఒక జర్మన్ వెబ్ సైట్ లో ఐ ఫోన్ లో వాట్స్ అప్ వీడియో కాలింగ్ అవుతున్నట్లు ఇమేజెస్ పోస్ట్ చేయబడ్డాయి. సో ఆడియో తో పాటు విడియో కూడా అతి త్వరలోనే రానుంది అని స్పష్టం అవుతుంది.
దీనితో పాటు వాట్స్ అప్ లో మల్టీ టాబ్ యూజర్ ఇంటర్ఫేస్ రానుంది అని అప్ డేట్. మల్టీ టాబ్ లో ఒక వ్యక్తీ తో కన్నా ఎక్కవు మందితో ఒకే సారి మాట్లాడే వారికీ సులువుగా ఉంటుంది చాటింగ్.
ఇమేజ్ సోర్స్