వాట్స్ అప్ లో అతి వీడియో కాలింగ్ ఫీచర్ వస్తుంది అనేందుకు మరొక విషయం లీక్ అయ్యింది

Updated on 09-May-2016

వాట్స్ అప్ మెసేజింగ్ సర్వీస్ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం వీడియో కాలింగ్ ఫీచర్ పై ఆల్రెడీ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ పోలిస్ వెబ్ సైట్ లో ఈ విషయం రిపోర్ట్ అయ్యింది.

యాప్ ను ఇతర భాషలలోకి అనువాదం చేయటానికి జరిగే పనులలో వీడియో కాలింగ్ ఫీచర్ గురించి అనుకోకుండా బయట పడింది అని చెబుతుంది ఆండ్రాయిడ్ పోలిస్ సైట్.

అనువాదాలు చేయమని అడిగినప్పుడు కంపెని "Video call" మరియు "Video calling is unavailable at this time" అనే రెండు లైన్స్ ను కూడా పంపింది.

సో అతి త్వరలోనే ఇది వస్తుంది అని అంచనా. అయితే ఇది ముందుగా లిమిటెడ్ users కు రిలీజ్ చేసి తరువాత అందరికీ రిలీజ్ చేస్తుందేమో వాట్స్ అప్. వాట్స్ అప్ కాలింగ్ కు కూడా కంపెని ఇలానే చేసింది.

సోర్స్ – ఆండ్రాయిడ్ పోలిస్

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :