మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: కాల్స్ లో ఉన్నప్పుడు use అవుతుంది [april 25]

Updated on 25-Apr-2016

యాప్ పేరు  కాల్ రైటర్. మీరు కాల్స్ లో ఉన్నప్పుడు ఏదైనా నోట్ చేసుకోవాలంటే ఇది ఆ అవసరాన్ని తీరుస్తుంది. ప్లే స్టోర్ లో దీని సైజ్ – 2.6MB. 4.2 స్టార్ రేటింగ్ కలిగి ఉంది.

మీరు కాల్స్ లో ఉండగా ఫోన్ నంబర్ లేదా అడ్రెస్ మరియు మరేదైనా ఇన్ఫర్మేషన్ ను నోట్ చేసుకోవాలంటే సడెన్ గా పెన్ లేదా పేపర్ దొరకవు..

స్మార్ట్ ఫోన్ ఉండగా పెన్ పేపర్ ఎందుకు అని అనుకోవటానికి కూడా అవ్వదు. ఎందుకంటే మనం ఫోన్ లో హోమ్ బటన్ ప్రెస్ చేసి మెసేజ్ లేదా నోట్ ప్యాడ్ ఓపెన్ చేయటం అంత సునాయాసంగా జరగని పని..

సో call writer ఇదే పనిని సులభంగా పూర్తీ చేస్తుంది. మీరు కాల్స్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. కాల్ డిస్కనెక్ట్ అయినా మీరు అంత వరకూ వ్రాసిన ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది ఆటోమేటిక్ గా.

ఇవి డేట్ అండ్ టైమ్ ప్రకారం సేవ అవటం వలన ఆ నోట్స్ ఎప్పుడు సేవ్ చేసాము అని కూడా తెలుసుకునేందుకు use ఆవుతుంది. యాప్ Xiaomi ఫోనుల్లో పనిచేయటానికి..

ఇలా చేయండి.. ఫోన్ యొక్క మెయిన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి యాప్స్ ఓపెన్ చేసి installed లోకి వెళ్లి call writer వద్దకు వెళ్లి పెర్మిషణ్ మేనేజర్ లో ఫై టాప్ చేయండి. ఇప్పుడు display pop up window వద్దకు వెళ్లి accept పై టచ్ చేయండి.

యాప్ డౌన్లోడ్ లింక్

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :