మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో చాటింగ్ చేస్తూ వీడియోస్ చూసుకొండిలా [MAY 27]

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో చాటింగ్ చేస్తూ వీడియోస్ చూసుకొండిలా [MAY 27]

యాప్ పేరు Lua ప్లేయర్. ప్లే స్టోర్ లో దీని రేటింగ్  4.3 స్టార్. సైజ్ మాత్రం కొంచెం ఎక్కువే. 17MB ఉంది. యాప్ లింక్ క్రింద ఉంది.

ప్రధానంగా ఈ వీడియో ప్లేయర్ ను మీకు పరిచయం చేయటానికి కారణం, ఇది pop video విండో తో వస్తుంది. అంటే మీరు వీడియో ను చిన్న విండో లోకి resize చేసుకొని మీ స్క్రీన్ పైన ఎక్కడైనా మూవ్ చేసుకోగలరు.

మిగిలిన ఫీచర్స్ విషయానికి వస్తే..

  • సబ్ టైటిల్స్ తో పాటు అన్నీ వీడియో ఫార్మాట్ లను సపోర్ట్ చేస్తుంది ప్లేయర్. థీమ్స్ కూడా ఉన్నాయి అదనంగా.
  • మీ ఫోన్ లో ఉండే థర్డ్ పార్టీ ఫైల్ మేనేజర్స్ నుండి వీడియోస్ ప్లే చేసినా అవి pop up విండో లో వస్తాయి.
  • 720P(HD) నుండి 1080P రిసల్యుషణ్ (ఫుల్ HD) వీడియోస్ ను కూడా ప్లే చేస్తుంది.
  • స్క్రీన్ షాట్ తీసే ఫీచర్ ఉంది.
  • కంప్లీట్ ఫ్రీ. ఎక్కడా యాడ్స్ కనిపించవు. MX ప్లేయర్ లో మీరు వీడియో ను pause చేస్తే వీడియోస్ కనిపిస్తాయి.
  • క్లిన్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ నెట్ వర్క్ స్ట్రీమింగ్ కూడా ఉంది.

యాప్ లో ఉన్న మైనస్ ఏంటంటే ఇది మ్యూజిక్ ప్లేయర్ గా పనిచేయదు. అయితే వీడియో ప్లేయర్ నే మ్యూజిక్ ప్లేయర్ గా వాడే వారికే ఇది మైనస్. రెండూ సెపరేట్ గా వాడటానికి అలవాటు పడిన వారికి ఇబ్బంది ఏమి లేదు.

యాప్ ను ప్లే స్టోర్ ను నుండి ఈ లింక్ లో డౌన్లోడ్ చేసుకోండి. సైజ్ మరీ ఎక్కువగా ఉంది అనుకునే వారికీ ఈ లింక్ లో Video Popup ప్లేయర్ అనే మరొక యాప్ ఉంది. ఇది కేవలం 5MB సైజ్ లో వస్తుంది.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo