ఆండ్రాయిడ్ ఫోన్స్ లో బాగా అవసరం ఉండేవి ఫోటోస్ చూడటం, దాచుకోవటం. ఈ రెండూ ఒకే అప్లికేషన్ లో దొరుకుతున్నాయి. అంటే ఊరికనే ఏదో జస్ట్ ఫోటో viewer లా కాకుండా ప్లే స్టోర్ లో ఉన్న అన్ని గేలరీ యాప్స్ కన్నా ఫాస్ట్ గా ఇమేజెస్ ను లోడ్ చేసి చూపించే మంచి గేలరీ యాప్, QuickPic Gallery.
దీని సైజ్, 2.36 MB. 3 మినిట్స్ పడుతుంది డౌన్లోడ్ అవ్వటానికి 2G ఇంటర్నెట్ లో. ప్లే స్టోర్ లో దీని రేటింగ్ 4.6. ఈ లింక్ లో దొరుకుతుంది ప్లే స్టోర్ లో. ఇది ఏంటో.. ఎందుకో సెపరేట్ గా చెప్పే అవసరం లేదు. గేలరీ అంటే అందరికీ అర్థమవుతుంది. CM లాంచర్, క్లిన్ మాస్టర్ యాప్స్ తయారు చేసిన డెవలపర్ cheetah mobile దీనిని డెవలప్ చేసింది.
దీనిలో ఉన్న ఫీచర్స్ సింపుల్ గా ఇక్కడ చూడండి..
1. ఫస్ట్ నిజంగా చెప్పుకోవలసినది, ఫాస్ట్ గా పిక్స్ లోడ్ అవుతాయి. అంటే మీ వద్ద ఎక్కువ ఫోటోస్ ఉంటె డిఫాల్ట్ గేలరీ యాప్ లో అవి ఓపెన్ అవటానికి సాధారణంగా కొంచెం టైమ్ తీసుకుంటాయి.
2. ఫోటోస్ ఫోల్డర్స్, లోకేషన్స్ అండ్ టైమ్ బట్టి కూడా sort చేసుకోవచ్చు. Moments అనే ఫీచర్ తో ఆటోమేటిక్ గా ఏ ఇయర్ లో.. ఏ మంత్ లో తీసిన ఫోటోస్ ఆ మంత్ ప్రకారం ఆల్బమ్స్ గా క్రియేట్ అయిపోతాయి.
3. ఇమేజ్ అండ్ వీడియో hiding. దీనితో ఫోటోస్ అండ్ వీడియోస్ ను పాస్వర్డ్ ద్వార్ hide చేస్తే మరేఇతర గేలరీ యాప్స్ లో కనిపించవు hide చేసినవి. అంటే hiding కోసం వేరే యాప్ వాడనవసరం లేదు కదా. పైగా ఫస్ట్ లోడింగ్ గేలరీ కూడా ఉంది గా. ఇది పాస్ వర్డ్ అండ్ pattern తో కూడా hide చేసుకోవచ్చు. అలానే ఎవరైనా ఇమేజ్ డిలిట్ చేయాలంటే పాస్వర్డ్ లేదా pattern లాక్ తెలిస్తేనే చేయగలరు.
4. GIF ఇమేజే లను, వీడియోలను ప్లే చేస్తుంది. ఇప్పుడు GIF పిక్స్ అవసరం ఉంది, ఎందుకంటే ఫేస్ బుక్ అండ్ ట్విటర్ లో GIF ఇమేజెస్ సపోర్ట్ చేస్తున్నాయి లేటెస్ట్ గా. GIF ఇమేజెస్ అంటే కదిలే ఫోటోస్. అప్పట్లో నోకియా ఫోనుల్లో ఉండేది ఈ ఫార్మాట్.
5. ఇమేజ్ ఎడిటింగ్ ఆప్షన్స్. కాని లిమిటెడ్, అంటే క్రాపింగ్, స్కేలింగ్, రొటేటింగ్ వంటివే ఉన్నాయి.
6. WiFi ట్రాన్సఫర్ ఫీచర్ తో వాట్స్ అప్, share IT అండ్ send2anywhere వంటి యాప్స్ అవసరం లేకుండా అవతల వ్యక్తి ఫోన్ లో కూడా ఈ యాప్ ఉంటే ఇమేజెస్ అండ్ వీడియోస్ ట్రాన్సఫర్ చేయగలరు.
7. మీ ఫోన్ లో ఆటో రొటేషన్ enable చేయకపోయినా కేవలం గేలరీ యాప్ కు రొటేషన్ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. సెట్టింగ్ లోకి వెళ్లి సెట్ చేసుకోవచ్చు.