దీని పేరు Bus App. యాప్ సైజ్ 1.26MB. అంటే 2 మినిట్స్ పడుతుంది 2G స్పీడ్ లో డౌన్లోడ్ చేయటానికి. ప్లే స్టోర్ లో ఈ లింక్ లోకి వెళ్లి ఇంస్టాల్ చేసుకోగలరు. 5 స్టార్ రేటింగ్ తో ఉంది ప్లేస్ స్టోర్ లో.
ఏమి చేస్తుంది Bus App?
మీరు ఇంటి నుండి కాలేజ్, లేదా ఒక ఊరు నుండి వేరే ఊరు వెళ్తుంటే.. టైమ్ పాస్ అవ్వటానికి గేమ్స్, మ్యూజిక్, మూవీస్ చూస్తుంటారు మొబైల్ లో.
అయితే వాటిలో పడి, అప్పుడప్పుడు దిగవలసిన స్టాప్ ను మరిచి పోయి దాటేస్తారు. మరిచిపోకపోయిన.. ప్రతీ సారి స్టాప్ వచ్చిందేమో అని చూస్తుంటారు. ఈ యాప్ మీకు ఆ పని ఆటోమేటిక్ గా చేసిపెడుతుంది.
ఎలా చేస్తుంది?
మ్యూజిక్ వింటూ పడుకుందామని అనుకునే వారికీ, లేదా సింగిల్ నైట్ జర్నిస్ చేసే వారికీ ఇది ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు దిగవలసిన ప్లేస్ ను ఈ యాప్ ద్వారా సెట్ చేసి, దానికి అలారం పెడితే..మీరు ఆ ప్లేస్ కు రాగానే ఇది అలారం సౌండ్ చేస్తుంది.
అప్లికేషన్ లో ఇంబిల్ట్ గా గూగల్ బేస్డ్ మ్యాప్స్ ఉంటుంది. ముందు యాప్ ఓపెన్ చేయగానే మీరు ఊరు పేరు ఎంటర్ చేసి సర్చ్ చేస్తే కొంత సమయం తరువాత మీ ఊరును ఎంచుకోమని లిస్ట్ ఇస్తుంది.
ఇప్పుడు ఆ ఉరిలో మీరు ఎక్కడ దిగాలని అనుకుంటే ఆ ప్లేస్ ను మ్యాప్స్ లో చూసి చేతితో పాయింట్ చేసి, అలారం సెట్ చేసుకోవటమే. అయితే దీనికి ఇంటర్నెట్ తో పాటు GPS ఆన్ అయ్యి ఉండాలి.
సో GPS ద్వారా మీరు బస్ లో కాని ట్రెయిన్ లో కాని, ఫోర్ వీలర్ లో కాని ఆ ప్లేస్ కు రాగానే ఇది మిమ్మల్ని అలెర్ట్ చేస్తుంది GPS లొకేషన్ ట్రాకింగ్ వలన.
మీకు తెలియని ఊరులకు వెల్ల వలసి వస్తే, బైక్ పై ఉన్నప్పుడు ప్రతీ సారి వచ్చిందా లేదా అని మొబైల్ ఓపెన్ చేసి చూసే అవసరం లేకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది.