లాంచర్స్ వంటివి ఎంత అందంగా ఉన్నప్పటికీ, మనకు కావలసిన అప్లికేషన ఓపెన్ చేయటానికి, ఎంత సింపుల్ గా ఉంటే అంట ఇష్టపడతాం. లేకుంటే అది ఎక్కడ ఉందా అని సర్చ్ చేసుకోవటం కొంచెం ఇబ్బందే.
అందుకే అందరూ ఎక్కువుగా వాడే యాప్స్ ను హోమ స్క్రీన్ పై పెట్టుకుంటారు. కానీ అక్కడ లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. సో ఈజీగా Gesture తో ఏదైనా యాప్ ఓపెన్ చేయటానికి Finger అనే యాప్ ఉంది. ప్లే స్టోర్ లో దిని రేటింగ్ 4.3. సైజ్ 7MB.
ఏమి చేస్తుంది?
మీకు నచ్చిన యాప్, సెట్టింగ్స్, షార్ట్ కట్, కాల్స్, ఏదైనా వాటి వద్దకు వెళ్ళకుండానే స్వైప్స్ తో ఓపెన్ చేసుకోవచ్చు..
ఎలా పనిచేస్తుంది..
1. యాప్ ఓపెన్ చేసి, గ్రీన్ కలర్ + సింబల్ పై ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు కనిపించే మెను లో మీరు దేనినైతే Gesture తో ఓపెన్ చేయాలనీ అనుకుంటున్నారో, దానిని సెలెక్ట్ చేయండి.
2. ఇప్పుడు నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే మిమ్మల్ని 3 సార్లు ఆ యాప్ కు Gesture ను స్క్రీన్ పై స్వైప్ చేయమని అడుగుతుంది.
3. మూడుసార్లు ఒకే షేప్ లో స్వైప్ చేయాలి. అంతే. ఇప్పుడు సర్విస్ ను స్టార్ట్ చేయటనికి, పై లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో ఉన్న 3 గీతల సింబల్ పై ప్రెస్ చేయండి.
4. దానిలో క్రింద సెట్టింగ్స్ లోకి వెళ్లి Finger Drawer Service ను enable చేయాలి. అంతే.
ఇప్పుడు మీ స్క్రీన్ పై కొత్తగా ఒక రౌండ్ బటన్ ఫింగర్ సింబల్ వస్తుంది. ఇక మీరు ఇంతకముందు సెట్ చేసిన యాప్ gesture ను ట్రై చేయటానికి, ఈ సింబల్ పై ప్రెస్ చేసి, స్వైప్ చేయండి. ఆ యాప్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది.