మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: ఫోకస్ నోటిఫై

Updated on 27-Oct-2015
HIGHLIGHTS

టెక్స్ట్ నోటిఫైర్ తో పాటు అలారం రిమైండర్ కూడా ఉంది

యాప్ పేరు Focus Notify. ప్లే స్టోర్ లో ఈ లింక్ లో 1.8MB సైజ్ ఉంది. 4.5 స్టార్ రేటింగ్. 2g ఇంటర్నెట్ స్పీడ్ లో 3 మినిట్స్ పడుతుంది. ప్లే స్టోర్ లో notifier యాప్స్ చాలా ఉన్నాయి. కానీ ఇది మంచి ఫీచర్స్ తో సింపుల్ గా ఉంది.

మీకు ఇంపార్టెంట్ లేదా చిన్న చిన్న పనులు చేయటం మరిచిపోయే అలవాటు ఉందా? అయితే ఇది బెస్ట్ అండ్ ఈజీ యుటిలిటీ. నోటిఫికేషన్ బార్ లో పైన నోటిఫై చేసి పెడుతుంది మీరు చేయవలసిన పనులను.

దీనిలో ఉన్న ఫీచర్స్..

1. నోటిఫికేషన్ లకు అలారం రిమైండర్ కూడా సెట్ చేసుకోవచ్చు.

2. టెక్స్ట్ తో పాటు నోటిఫికేషన్ bar లో ఇమేజ్ కూడా పెట్టుకోగలరు.

3. రిమైండర్ టెక్స్ట్ ను షేర్ చేయవచ్చు.

4. లిస్ట్ ఎక్కువ ఉంటే, ఆర్డర్ కు సెట్ చేసుకోగలరు.

5. నోటిఫికేషన్ రిమైండర్స్ ను ప్రొటెక్ట్ కూడా చేసుకోగలరు.

సెట్టింగ్స్ లో నోటిఫికేషన్ స్టైల్, అలారం సౌండ్, led, వైబ్రేషన్ వంటి సెట్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఎక్కువ notifiers ఉంటే వాటిని కేవలం ఒక్క నోటిఫికేషన్ లో hide చేయవచ్చు. 

ఏదైనా గుర్తుకు వచ్చి, వెంటనే దానిని రిమైండర్ గా సెట్ చేసుకునే అవకాసం సింపుల్ గా ఇస్తుంది. దానితో పాటు రిమైండర్ అవసరం లేకుండా సింపుల్ గా టెక్స్ట్ రూపంలో ఎప్పుడూ కనిపించేలా ఇది యూజ్ఫుల్ గా ఉంది.

 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :