జెనెరల్ గా ఆండ్రాయిడ్ లో యాప్, గేమ్స్ కాకుండా లాంచర్స్ అని కొన్ని యాప్స్ ఉంటాయి. ఇవి యాప్స్ ఇతర సెట్టింగ్స్ ను ఓపెన్ చేసుకోవటానికి వర్క్ అవుతాయి. వాటితో పాటు ఆకర్షణీయమైన లుక్స్ అండ్ థీమ్స్ కూడా ఉంటాయి.
ఇప్పుడు ఒక కొత్త లాంచర్ గురించి చూడండి. దీని పేరు KISS launcher. ప్లే స్టోర్ లో ఈ లింక్ లో 4.1 స్టార్ రేటింగ్ తో 178KB తో చాలా తక్కువ సైజ్ లో ఉంది. సేకేండ్స్ లో డౌన్లోడ్ అవుతుంది 2g స్పీడ్ లో.
ఇది చాలా సింపుల్ అండ్ యూస్ఫుల్ గా ఉంటుంది. ఎక్కువ హంగులు, ఆప్షన్స్ అంటూ ఏమీ ఉండవు. సింపుల్ గా చిన్నగా ఉపయోగకరంగా ఉండేలా మినిమల్ డిజైన్ ను ఎవరైనా ఇష్టపడితే వారికి ఇది బాగా నచ్చవచ్చు.
యాప్స్ ఓపెన్ చేయాలంటే జస్ట్ క్రింద సర్చ్ బార్ ఉంటుంది. అందులో యాప్ నేమ్ టైప్ చేస్తే లిస్ట్ వస్తుంది. కేవలం యాప్స్ మాత్రమే కాదు, కాంటాక్ట్స్, సెట్టింగ్స్, నోటిఫికేషన్ బార్ సెట్టింగ్ టాగిల్స్ కూడా. ప్రత్యేకంగా యాప్ డ్రాయర్ లాంటివి ఏమి ఉండవు.
ఫ్రిక్వెంట్ యాప్స్ లిస్ట్ కూడా చూపిస్తుంది. వాల్ పేపర్ సెట్ చేసుకునే ఫీచర్ ఉంది. లాంచర్ సెట్టింగ్స్ లో యాప్ సార్టింగ్ ఆర్డర్, థీమింగ్(లైట్, డార్క్, ట్రాన్స్ పరెంట్, సెమి ట్రాన్స్ పరెంట్). క్రింద ఉన్న సర్కిల్ మీద క్లిక్ చేస్తే యాప్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది.