మీకు తెలియని అప్లికేషన్: స్మార్ట్ సెట్టింగ్స్

Updated on 22-Sep-2015
HIGHLIGHTS

ఆటోమేటిక్ గా మీకు కావలసిన సెట్టింగ్స్ ఆన్ చేస్తుంది.

దీని పేరు స్మార్ట్ సెట్టింగ్స్. ఫ్రీ గా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో ఈ లింక్ లో ఉంది. సైజ్ జస్ట్ 1.02MB. అంటే 1 నిమిషం పడుతుంది 2G లో డౌన్లోడ్ అవ్వటానికి. పైన యాప్ స్క్రీన్ షాట్స్ చూసి ఓల్డ్ అప్లికేషన్ అని అనుకోకండి. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ లాలిపాప్ మేటేరియాల్ డిజైన్ తో వస్తుంది.

Smart settings ఏమి చేస్తుంది?
మీ మొబైల్ లో ఆటో రొటేషన్ ఫీచర్ ఆన్ చేసి పెడితే జస్ట్ మొబైల్ చిన్నగా కదిలిస్తే చాలు అవసరం లేకపోయినా రొటేట్ అవుతుందా? సో అందుకనే దానిని ఆఫ్ లో పెడతాం చాలా మంది. 

కానీ మళ్ళీ ఫోటోస్ అండ్ వీడియోస్ చూస్తుంటే రొటేషన్ కోరుకుంటాం. మనం సింగిల్ గా చూసుకునేటప్పుడు నో ప్రాబ్లెం, కాని ఎవరికైనా ఫోటోస్ చూపిస్తున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది.

వెనక్కి వెళ్లి, ఆటో రొటేషన్ ను ఆన్ చేసి చూపించాలి. ఈ యాప్ కావలసిన అప్లికేషన్ కు ఆటోమేటిక్ గా ఆటో రొటేషన్ ను ఆన్ చేస్తుంది. అంటే సిస్టం సెట్టింగ్స్ ను అన్నీ అప్లికేషన్ల పైనా కాకుండా కేవలం selected యాప్స్ కు పనిచేసేలా చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది..?
అంటే ముందుగానే మీరు ఎటువంటి అప్లికేషన్స్ కు ఆటో రొటేషన్ ఆన్ అయ్యి ఉండాలి, ఎటువంటి యాప్స్ కు ఆటో రొటేట్ వద్దు అని సెలెక్ట్ చేసుకుంటే ఇది పని చేస్తుంది. 

ఆటో రొటేషన్ మాత్రమే కాదు, స్క్రీన్ ఆఫ్ ఫీచర్, WiFi ఆన్ అండ్ ఆఫ్, బ్లూటూత్ enable ఫీచర్ కూడా సపోర్ట్ చేస్తాయి ఇలానే. యాప్ ను ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :