బ్లూ బర్డ్ Twitter కి పోటీగా తెచ్చిన ఇండియా యొక్క ఎల్లో బర్ద్ Koo గుడ్ బాయ్ చెప్పింది. ఇండియన్ సోషల్ మీడియా Koo ని ట్విట్టర్ కి పోటీగా తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, గతకొంత కాలంగా ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ప్లాట్ ఫామ్ ను పూర్తిగా బంద్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ షోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను నిలబెట్టడానికి యాజమాన్యం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే, చివరికి ఓటమిని ఒప్పుకోలేక తప్పలేదు.
Koo అనేది ట్విట్టర్ కి పోటీగా తీసుకు వచ్చిన ఇండియన్ షోషల్ మీడియా ప్లాట్ ఫామ్. అనేకమంది సెలబ్రేటిస్ మరియు 9000 వేలకు పైగా VIP అకౌంట్స్ తో సహా 21 లక్షల అకౌంట్ లను కలిగిన ఉన్న ఈ ప్లాట్ ఫామ్ ఇప్పుడు షట్ డౌన్ అయ్యింది. అతిగా పెరిగిన టెక్నాలజీ ఖర్చులు మరియు ఊహకు అందని క్యాపిటల్ మార్కెట్ వంటి విషయాలు ఈ చర్యకు దారి తీసినట్లు యాజమాన్యం తెలిపింది.
ఈ కూ ప్లాట్ ఫామ్ స్థాపకులు అప్రమేయ రాధాకృష్ణ మరియు మయాంక్ బీదవట్క ఈ విషయాన్ని తెలియపరిచారు. అయితే, కూ ప్లాట్ ఫామ్ ను కొనసాగించడానికి తీసుకున్న చర్యలు మరియు ప్రయత్నాలను కూడా గుర్తు చేశారు. ముందుగా, ఈ ప్లాట్ ఫామ్ యొక్క కొన్ని అసెట్స్ ను అమ్మకానికి సుముఖంగా ఉన్నట్లు కూడా స్థాపకులు తెలిపారు.
అయితే, ఈ ప్రయత్నానికి కూడా చుక్కెదురవ్వడంతో, కూ షోషల్ మీడియా ను పూర్తిగా నిలిపి వేయడం మాత్రమే చివరగా మిగిలిన ఆప్షన్ గా మారింది. అందుకే, ఈ ఇండియన్ షోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని షట్ డౌన్ చేసినట్లు అనౌన్స్ చేయవలసి వచ్చిందిట.
Also Read: CMF Phone 1 లో 50MP Sony డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ చేసిన కంపెనీ.!
కూ యాప్ కూడా 50 లక్షల కంటే ఎక్కువ డౌన్ లోడ్స్ సాధించింది మరియు 10 భారతీయ భాషల్లో అందుబాటులో వుంది. ఈ భారతీయ సోషల్ మీడియా సర్వీస్ ఇక నుంచి అందుబాటులో ఉండదు.