ట్విటర్ లో 360 Live వీడియోస్ స్ట్రీమింగ్ సపోర్ట్ వచ్చింది
By
Karthekayan Iyer |
Updated on 29-Dec-2016
ట్విటర్, 360 డిగ్రీ లైవ్ వీడియో సపోర్ట్ యాడ్ చేసింది. Live వీడియో చేయటానికి ఉండే Periscope యాప్ లో ఇక నుండి కొన్ని సెలెక్ట్ broadcasters నుండి 360 వీడియో స్ట్రీమింగ్ ఆనందించగలరు. ఇదే మాదిరిగా లాస్ట్ week ఫేస్ బుక్ కూడా 360 లైవ్ వీడియోస్ అంటూ కొత్త ఫీచర్ ప్రవేసపెట్టింది. ట్విటర్ లో 360 వీడియోస్ ను ఐడెంటిఫై చేయటానికి కంపెని వాటికి Live 360 అనే టాగ్ ఇస్తుంది. అంటే ఈ వీడియో లను చూస్తున్నప్పుడు మీరు ఫోన్ ఎటువైపుకు మళ్లిస్తే అటువైపుగా ఉండే ప్రదర్శనను చూపిస్తుంది వీడియో. అయితే ప్రస్తుతానికి కేవలం కొంతమందే వీటిని live స్టార్ట్ చేయగలరు. జనరల్ గా అయితే periscope ద్వారా ట్విటర్ అకౌంట్ ఉన్న ప్రతీ వ్యక్తి నార్మల్ లైవ్ వీడియో ను స్టార్ట్ చేయగలరు.