ఫోన్ లో ఈ 3 సెట్టింగ్స్ ఇప్పుడే బంద్ చేయండి , Google మీపై దృష్టి కేంద్రీకరిస్తుంది….

Updated on 01-Apr-2018

మీరు స్మార్ట్ఫోన్ వినియోగదారు అయితే, ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది . Google ప్లస్ ద్వారా, మీ ఫోన్ లో  డేటా, యాప్స్ ,  కాంటాక్ట్స్  మొదలైనవి సమకాలీకరించబడతాయి మరియు మీరు కలిగి ఉన్న ప్రతి వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ ట్రాక్ చేస్తుంది.

వాస్తవానికి, గూగుల్ తన  వినియోగదారుల యొక్క మొత్తం డేటాను తన దగ్గర స్టోర్  చేస్తుంది, దీని ద్వారా దాని వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తుంది. అటువంటి పాపులర్ సర్వీస్  Google వాయిస్ అసిస్టెంట్, దీనిలో వినియోగదారులు వారి వాయిస్  ద్వారా ఫోన్ ని ఆపరేట్ చేయగలరు .

ఈ సెట్టింగ్స్ మీ సమాచారాన్ని సెక్యూర్  చేస్తాయి –

గూగుల్ వాయిస్ అసిస్టెంట్ పై  కమాండ్ ఇచ్చిన తర్వాత, ఆ ఆడియో ఫైల్ గూగుల్ డేటా బేస్ లో  సేవ్ అవుతుంది. కేవలం వాయిస్ కమాండ్స్ ను మాత్రమే కాదు, మీరు చేసే అన్ని సెర్చింగ్స్ , Google తన  అన్ని రికార్డులలో ప్రతిదీ సేవ్ చేస్తుంది . మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని Google కి కలిగి ఉండటం సరైనది కాదు అని అనుకుంటే మీ ఫోన్లో కొన్ని సెట్టింగ్లను మార్చడం ద్వారా మీరు దానిని  ఆపవచ్చు . మీ  సమాచారాన్ని మొత్తం  యాక్సెస్ చేయనీయకుండా  నిరోధించగల మూడు ముఖ్యమైన సెట్టింగుల గురించి ఇక్కడ మేము మీకు చెప్తున్నాము.

సెట్టింగ్  1- 

మొదట మీ ఫోన్ సెట్టింగ్లకు వెళ్లండి. ఇప్పుడు Google  యాక్టివిటీ కంట్రోల్ లోకి వెళ్లడం ద్వారా వాయిస్ మరియు ఆడియో యాక్టివిటీ ను ఆపివేయండి. దీని తర్వాత, మీ Google  అకౌంట్ నుంచి  మీ ఆడియో రికార్డింగ్ లింక్ అవ్వదు  మరియు మీ వాయిస్ కమాండ్స్  సేవ్ చేయబడవు.

సెట్టింగ్  2- 

మైక్రోఫోన్ల ద్వారా గూగుల్ తన యూజర్లను ట్రాక్ చేస్తుంది . ఈ సందర్భంలో మీరు దీన్ని ఆపివేయవచ్చు. దీని కోసం అన్ని యాప్స్ కి  వెళ్లి, Google కి వెళ్లి, టాప్ చేయండి .  యాప్ పర్మిషన్  లో వెళ్లి, మైక్రోఫోన్ ని  ఆపివేయండి.

సెట్టింగ్  3- 

సెట్టింగులలో గూగుల్ కి వెళ్లి   సెర్చ్ కు వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ మీరు అనేక ఆప్షన్స్ ను చూస్తారు, ఇక్కడ యాప్ ని  నొక్కండి. ఇప్పుడు వాయిస్ మ్యాచ్ లో టాప్ చేసి మరియు "Ok google" సెట్టింగ్ ని  ఆపివేయండి .

 

 

Connect On :