TrueCaller లో అదిరే కొత్త ఫీచర్: ఇన్ కమింగ్ కాల్ ఎందుకు చేశారో కూడా చెప్పేస్తుంది
TrueCaller దాని కాలర్ ఐడి యాప్ లోపల కొత్త ఫీచర్ గా Call Reason ఫీచర్‌ను కూడా చేర్చింది.
ఈ కొత్త ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఎందుకు కాల్ చేస్తున్నారో ముందుగానే తెలుసుకోవచ్చు.
Call Reason ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
ట్రూకాలర్ దాని కాలర్ ఐడి యాప్ లోపల కొత్త ఫీచర్ గా Call Reason ఫీచర్‌ను కూడా చేర్చింది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఎందుకు కాల్ చేస్తున్నారో ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ గురించి చాలా ఫీడ్‌బ్యాక్ మెసేజిలు వస్తున్నాయని ట్రూకాలర్ తెలిపింది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం Call Reason ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది మరియు iOS వినియోగదారుల కోసం ఈ ఫీచర్‌ను ఎప్పుడు ప్రారంభించనుందో అనే విషయం పైన మాత్రం స్పష్టత లేదు.
మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోని TrueCaller క్రొత్త అప్డేట్ తో, ఎవరైనా కాల్ ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని TrueCaller వినియోగదారులకు తెలియజేస్తుంది మరియు ఆ ఇన్ కమింగ్ కాల్ ఎంత ముఖ్యమో వినియోగదారులకు తెలియజేస్తుంది. ఈ ఫీచర్ గురించి ట్రూకాలర్ తన బ్లాగ్ పోస్ట్‌లో ఇలా తెలిపింది, "మొదట మేము ఎవరు కాల్ చేస్తున్నారో తెలిపాము, ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నారో వివరిస్తాము?. అని దీని గురించి సూచన ప్రాయంగా వ్రాసింది.
2021 లో, కాల్ రీజన్ ఫంక్షన్ ట్రూకాలర్ కస్టమర్లకు ప్రాధాన్యతనివ్వడం ప్రారంభిస్తుందని మరియు ధృవీకరించబడిన వ్యాపారాలు కస్టమర్లను సులభంగా చేరుకోగలవని కంపెనీ తెలిపింది.
TrueCaller Call Reason
ఏదైనా ఇన్‌కమింగ్ కాల్‌లో కాల్ చేయడానికి గల కారణాన్ని ట్రూకాలర్ ఇప్పుడు మీకు తెలియజేస్తుంది. తద్వారా కాల్ ప్రైవేట్ లేదా మారే ఇతర కారణాల వల్ల చెయ్యబడిందని వినియోగదారులకు తెలుస్తుంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ట్రూకాలర్ వెర్షన్ 11.30 లో ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టబడుతుంది.
కాల్ చేయడానికి ముందు కాలర్లకు మూడు అనుకూల కారణాలు ఇవ్వబడతాయి. అదనంగా, యాప్ లోని కాలర్స్ ప్రతి కాల్‌లోనూ కొత్త కారణాన్ని(Reason) యాడ్ చేయవచ్చు. ప్రస్తుతం వినియోగదారులు అనుకూల కారణాన్ని(Custom Reason) మాత్రమే జోడించగలరు అలాగే క్రొత్త కారణాన్ని వ్రాయగలరు.
ఈ ఫీచర్ ట్రూకాలర్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు Android వినియోగదారులు మాత్రమే దీన్ని ఉపయోగించగలరు.
సంస్థ SMS షెడ్యూల్ మరియు SMS అనువాదం అనే రెండు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. షెడ్యూలింగ్ ఫీచర్ మెసేజీని సెటప్ చేయడానికి ముందు రిమైండర్‌లను సెట్ చేయడానికి మరియు అనువాద ఫీచర్ యాప్ లోని సందేశాన్ని శీఘ్రంగా అనువదించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.