టెలికం అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇండియన్ మొబైల్ నెట్ వర్క్స్ వాడుతున్న వారి కోసం అఫీషియల్ గా ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేసుకునేందుకు MY SPEED అనే యాప్ రిలీజ్ చేసింది.
దీనిని ఈ లింక్ లో నుండి డౌన్లోడ్ చేసుకోగలరు ఆండ్రాయిడ్ users. 4.8 MB సైజ్ కలిగి ఉంది. అంటే 2G ఇంటర్నెట్ స్పీడ్ లో 5 నిమిషాలలో డౌన్లోడ్ చేయగలరు. 3.8 స్టార్ రేటింగ్ కలిగి ఉంది.
అసలు విషయానికి వస్తే.. ఇదే పని చేయటానికి చాలా యాప్స్ ఉన్నాయి ఆల్రెడీ, అవన్నీ కాదని మన ఇండియన్ గవర్నమెంట్ యాప్ ఎందుకు వాడాలి అని అనుకునేవారికి TRAI ఒక రీజన్ ఇచ్చింది.
మీరు యాప్ లో యాడ్స్ చూడరు. మిగిలిన స్పీడ్ చెకింగ్ యాప్స్ లో యాడ్స్ ఉంటాయి దిగువున. యాప్ తో వైఫై speeds కూడా చెక్ చేసుకోగలరు.
అలాగే ఈ speed టెస్ట్ లలో వచ్చిన results TRAI కు సేండ్ చేయగలరు. మీ ఫోన్, లొకేషన్ తో పాటు టెస్ట్ results వెళ్తాయి కానీ ఎటువంటి ఇతర పెర్సొనల్ ఇన్ఫోర్మషన్ వెళ్లవు అని చెబుతుంది యాప్.
అయితే మీరు పంపే ఈ results ను TRAI నెట్ వర్క్ల పై కంప్లైంట్స్ గా తీసుకోదు. అందుకు నెట్ వర్క్ వాళ్ళకే కంప్లైంట్ చేయాలి. ఈ లింక్ లో డౌన్లోడ్ చేయగలరు యాప్ ను.