టాప్ 5 ఆండ్రాయిడ్ కారు రేసింగ్ గేమ్స్
ఆండ్రాయిడ్ ఫోన్లో మీకు అద్భుతమైన గేమింగ్ అనుభూతినిస్తాయి ఈ గేమ్స్
మొదటి నుండి ఫైనల్ లైన్ వరకు ఉత్కంతంగా నడిచే ఒక కారు రేసును ఎవరు ఇష్టపడరు? ఆప్ స్టోరులో, నిరంతరం మెరుగుపరచబడిన గ్రాఫిక్స్ మరియు ఆటతీరుతో వారి మార్కును నిలబెట్టుకునే కొన్ని గేమ్స్ నుండి టాప్ 5 గేమ్లను, ఈ రోజు మేనము చూద్దాం! (ఉత్తమైన వాటినుండి తీసుకున్న టాప్ 5 గేమ్స్ మాత్రమే) మీరుకూడా ఈ గేమ్ ఆడాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన గేమ్ పేరుపైన నొక్కడంతో ఆప్ స్టోర్ లోకి వెళతారు, అక్కడ గేమ్ డౌన్ లోడ్ చేసుకొని ఆడవచ్చు.
ఆస్పాల్ట్ 8 అబ్భుతమైన విజయాన్ని సాధించడంతో, దానికి కొనసాగింపుగా ఈ ఆస్పాల్ట్ 9 ని తీసుకొచ్చింది. ఈ కొత్తగా వచ్చిన గేములో కొత్త వాతావరణము, ఛాలెంజ్ మరియు స్టంట్లను తీసుకొస్తుంది. అంటే, ఇపుడు మరింత గేమింగ్ అనుభూతిని పొందవచ్చు ఈ ఆస్పాల్ట్ 9 గేముతో. అలాగే ఇందులో కొత్త కార్లు మరియు సులభమైన కంట్రోల్స్ కూడా తీసుకొచ్చింది.
Drift Max City -Car Racing in City
ఈ డ్రిఫ్ట్ మ్యాక్స్ సిటీ గేమ్ ఆడుతున్నప్పుడు, నిజమైన రోడ్డు మీద రేసింగ్ చేస్తున్న అనుభూతి మీకు కలుగుతుంది మరియు ఇందులో హై పెరఫార్మెన్సు కార్లను ఇందులో మీరు డ్రైవ్ చేయవచ్చు. ఈ గేములో 14 డ్రిఫ్ట్ కార్లను అందిస్తుంది మరియు 7 రేస్ ట్రాక్లను కూడా అందిస్తుంది. మీరు రేసింగ్ చేసేటప్పుడు ఈ ప్లేస్ తెలిపే విధంగా స్కోర్ బోర్డు కూడా చూడవచ్చు .
మీరు ఎక్కువ చాలెంజింగ్ ఉండేటువంటి గేమ్లను ఇష్టపడేవారైతే కనుక ఈ గేమ్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ గేమ్ లో అనేకరకాలైన ఆశ్చర్యకర విన్యాసాలను మీరు చేయవలసివుంటుంది. మెలితిరిగిన మార్గాలు మరియు ఘోరమైన అడ్డంకులవంటి వాటిని దాటుకుంటూ మీ కారును నడపవలసివుంటుంది.
ఈ రియల్ రేసింగ్ 3 గేమ్ అధికారకంగా ద్రువీకరించబడిన ట్రాక్స్ తో వస్తుంది మరియు వేగవంతమైన కార్లతో మంచి గేమింగ్ అనుభూతినిస్తుంది. ఈ గేములో, మీరు అనేక కెమేరా వ్యూస్ అందుకోవచ్చు మరియు ఈ ఆట తీరు చాల సున్నితంగా ఉంటుంది. ఇది ఎక్కువగా గ్రాఫిక్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది.
నీడ్ ఫర్ స్పీడ్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదనుకుంటా, ఎందుకంటే ఇప్పటివరకూ వచ్చిన ఈ గేమ్ సిరీస్లలో చాల ప్రాచుర్యాన్ని పొందిన వాటిలో ఇది కూడా ఒకటి. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు చాల ఎక్సయిట్మెంట్ గా ఉంటుంది మరియు ఇప్పుడు కోతగా తెచ్చిన గ్యారేజితో మీ కారును మీకు కావలసినట్లుగా మార్చుకునే అవకాశంకూడా అందించింది.