కరోనావైరస్ మహమ్మారి కారణంగా Google Duo ప్రతి వారం 10 మిలియన్లకు పైగా సైన్-అప్ లను రికార్డ్ చేస్తోంది. కరోనా మహమ్మారి వలన తలెత్తిన లాక్ డౌన్ కాలంలో, ఇంటి నుండి పని చేసే వారి వలన, ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ మరియు ఇటువంటి సర్వీస్ పెరుగుదలకు దారితీసింది. భద్రతా లోపాల కారణంగా, జూమ్ అందరి దృష్టిలో పడటంతో, గూగుల్ అనేక దేశాలలో కాల్ నిమిషాల్లో 10 రేట్ల వృద్ధిని చూస్తోందని మరియు ఈ యాప్ మరింత సురక్షితంగా మరియు యాక్సెస్ చేయడానికి కొత్త ఫీచర్ల గ్రూప్ ని కూడా విడుదల చేస్తోందని గూగుల్ తెలిపింది.
బ్లాగ్ పోస్ట్‌లో, గూగుల్ తన ప్రసిద్ధ వీడియో కాలింగ్ యాప్ కి కొత్త ఫీచర్లను జోడిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ డుయో కొత్త వీడియో కోడెక్ సపోర్ట్, స్క్రీన్ షాట్ బటన్ మరియు మరెన్నో తీసుకువచ్చే అప్డేట్ ను అందుకోనుంది. దాని డుయో వీడియో కాలింగ్ యాప్ యొక్క వినియోగదారులు గతంలో కంటే 180 శాతం ఎక్కువ మెసేజిలను ఇచ్చి పుచ్చుకుంటున్నారని కంపెనీ వెల్లడించింది, సామాజిక దూరాన్ని ఖచ్చితంగా అనుసరిస్తున్న ప్రాంతాలలో 800 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
మీరు తక్కువ బ్యాండ్‌విడ్త్ కనెక్షన్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ వీడియో కాల్ నాణ్యతను మెరుగుపరచడాన్ని లక్ష్యంగా కొత్త వీడియో కోడెక్ మద్దతును Google తీసుకువస్తోంది. AV1 వీడియో కోడెక్ కు మద్దతు ఇవ్వడానికి Duo త్వరలో అప్డేట్ చేయబడుతుంది. ఇది కాల్ లో ఉన్నప్పుడు 30kbps వీడియో స్ట్రీమ్ ను నిర్ధారిస్తుంది. ఈ విధానాన్ని ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ మరియు యూట్యూబ్ వాడుకలో ఉంచాయి మరియు తక్కువ బ్యాండ్‌విడ్త్ కనెక్షన్ల కోసం 30% వరకు మెరుగుదలని అందిస్తుంది.
"డుయో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ గా మరియు మీ వీడియో కాలింగ్ అనుభవం స్పష్టంగా మరియు నిరంతరాయంగా ఉండేలా మేము నిరంతరం ఆప్టిమైజేషన్లు చేస్తున్నాము" అని కంపెనీ తన భద్రతా చర్యలను పునరుద్ఘాటించింది. వేవ్‌నెట్‌క్యూ తో ఆడియో నాణ్యతను మెరుగుపరచడానికి గూగుల్ డుయో AI ని మరింత ప్రభావితం చేస్తుంది.
ఈ ఆప్ క్రొత్త బటన్ను కూడా పొందుతోంది, ఇది స్క్రీన్ యొక్క ఫోటో (స్క్రీన్ షాట్) తీయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది మరియు దాన్ని ఆటొమ్యాటిగ్గా సేవ్ చేయడానికి పక్కపక్కనే ఏర్పాటు చేస్తుంది. ఈ ఫీచర్ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్‌లు మరియు Chromebook లలో విడుదల చేయబడుతోంది మరియు త్వరలో గ్రూప్ కాల్స్ కూడా ఈ కార్యాచరణకు మద్దతు ఇస్తాయి.
గూగుల్ ఇటీవల వీడియో కాల్ల్స్ లో పాల్గొనే పరిమితిని 12 మంది వినియోగదారులకు పెంచింది మరియు ఇప్పుడు పరిమితిని మరింత పెంచే ప్రణాళికలను కూడా కంపెనీ వెల్లడించింది. దీనితో పోల్చితే, Facebook మెసెంజర్ వీడియో కాల్లో 50 మందికి మద్దతు ఇస్తుంది.
ఈ యాప్ ఆటోమ్యాటిగ్గా మీ వీడియో మరియు వాయిస్ సందేశాలకు 24 గంటల తర్వాత తీసేస్తుంది. గూగుల్ డుయో ఆండ్రాయిడ్, iOS , విండోస్, మాక్, క్రోమోస్ మరియు మరిన్నింటిలో లభిస్తుంది.