మైక్రో సాఫ్ట్ కంపెనీ తమ సక్సెస్ ఫుల్ ప్రోడక్ట్ Skype ను కొన్ని ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పై నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అయితే వీటిలో విండోస్ ఫోన్ కూడా ఉండటం విశేషం.
విండోస్ ఫోన్ 8, 8.1 తో నడిచే స్మార్ట్ ఫోన్స్ పై అక్టోబర్ 2016 తరువాత skype పనిచేయదు. అలాగే android 4.0.3 కన్నా తక్కువ వెర్షన్ తో రన్ అయ్యే ఫోన్స్ లో కూడా Skype 6.2 పనిచేయదు. అయితే స్కైప్ వెర్షన్ 4 రన్ అవుతుంది.
కంపెనీ ఇందుకు రీజన్స్ కూడా తెలిపింది. బ్యాక్ గ్రౌండ్ లో peer-to-peer based architecture నుండి క్లౌడ్ కు మారుతున్నందుకు ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు చెప్పింది.
అయితే మీ ఫోన్ వెర్షన్ ఏదైనా బ్రోజర్ లో skype ను వాడుకోగలరు.