Corona!! పైన పోరాటానికి డొనేషన్ స్టిక్కర్లను తీసుకొచ్చిన TikTok : ఎలా యాడ్ చేయాలో తెలుసుకోండి

Updated on 30-Apr-2020
HIGHLIGHTS

ఈ స్టిక్కర్ల సహాయంతో ఎక్కువ నిధులను సేకరించవచ్చు.

చిన్న వీడియో షేరింగ్ మరియు క్రియేట్ యాప్ TikTok, ఈ కరోనావైరస్ మహమ్మారిపై పోరాడటానికి అనేక చర్యలు తీసుకుంది. కరోనావైరస్ ఉపశమనం కోసం క్రియేటర్స్  నిధులు సేకరించడానికి సహాయపడే కొత్త ఫీచర్ డొనేషన్ స్టిక్కర్‌ ను ఇప్పుడు ఈయప్ ప్రవేశపెట్టింది. ఈ డొనేషన్ స్టిక్కర్స్ ఈ App లో అందుబాటులో ఉన్నాయి. వీడియోలు మరియు TikTok లైవ్ స్ట్రీమ్ ‌ల సమయంలో ఈ డొనేషన్ స్టిక్కర్లను ఉపయోగించవచ్చు. ఈ విధంగా, వీడియోలు చూసే వారు  వీడియోలోని స్టిక్కర్‌ పైన సులభంగా క్లిక్ చేసి, విరాళాన్ని నేరుగా ఇవ్వవచ్చు. అయితే, ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.                                

TikTOk ఒక ప్రకటనలో, "మేము ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాము మరియు సమాజంలో ప్రజలు ఒకరికొకరు సహాయపడటానికి తీసుకున్న చర్యల పరంగా మేము ఆనందిస్తున్నాము" అని అన్నారు. మేము మా వినియోగదారులకు విరాళం కోసం కొత్త మార్గాన్ని ఇస్తున్నాము. ఈ రోజు మనం యాప్ లో కొత్త ఫీచరుగా ఈ డొనేషన్ స్టిక్కర్లను ప్రారంభిస్తున్నాము. ఈ విధంగా క్రియేటర్లు వీడియో మరియు TikTok Live ప్రసారాలలో ఈ స్టిక్కర్ల సహాయంతో ఎక్కువ నిధులను సేకరించవచ్చు. ”

స్టిక్కర్లను నేరుగా వీడియో లేదా టిక్‌టాక్ లైవ్ స్ట్రీమ్‌ లో పొందుపరచవచ్చని కంపెనీ పేర్కొంది. డొనేషన్ (విరాళం) స్టిక్కర్‌ ను నొక్కిన తర్వాత, వినియోగదారు పాప్-అప్ విండో ను పొందుతారు, అక్కడ వారు యాప్ నుండు మారకుండానే  వారి డొనేషన్లను (విరాళం) చేయవచ్చు. సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ సిడిసి ఫౌండేషన్, జేమ్స్ బార్డ్ ఫౌండేషన్, మీల్స్ ఆన్ వీల్స్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది.

ఇది కాకుండా, టిక్టాక్ కూడా స్టిక్కర్ల ద్వారా వచ్చే విరాళాలను మే 27 న మ్యాచ్ చేస్తుందని కూడా నివేదించింది.

మీ TikTok ‌కు డొనేషన్ స్టిక్కర్లను ఎలా జతచేయాలి ?

డొనేషన్ స్టిక్కర్ జతచేయడానికి, మీరు టికెటాక్ యాప్ లో ఎడిటింగ్ కి వెళ్లి [COVID-19] డొనేషన్ స్టిక్కర్ ‌పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీరు విరాళం ఇవ్వాలనుకునే సంస్థను ఎన్నుకోవాలి.

దీని తరువాత, #doubleyourimpact యొక్క క్యాప్షన్ వీడియోలో స్టిక్కర్ ఉంచిన తర్వాత దానితో జతచేయబడుతుంది.

గత నెలలో టిక్టాక్ COVID-19 ఉపశమనం కోసం 250 మిలియన్ డాలర్లు మరియు భారతదేశంలో వైద్య పరికరాల కోసం 100 కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. వీటితో, ముందు వరుసలో నిలబడి పోరాడుతున్న వైద్య సిబ్బందిని రక్షించడానికి వైద్య పరికరాలు తీసుకోవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :