గూగుల్ ప్లే స్టోర్ నుండి మాయమైన TikTok
యువతను పెడదారిన తీసుకెళుతొందన్న నినాదంతో ముందుకు వచినటువంటి, తమిళనాడు రాష్ట్ర విన్నతిని స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం యొక్క నిర్ణయానికి మద్దతుగా గూగుల్ తన ప్లే స్టోర్ నుండి ఈ ఆప్ ని బ్లాక్ చేసింది . అంటే, ఈ ఆప్ ఇక మీకు గూగుల్ ప్లే స్టోర్ నుండి కనిపించదు. అయితే, ఇప్పటి వరకు డౌన్ లోడ్ చేసుకున్నవారు మాత్రం దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఆపిల్ యూజర్లకు మాత్రం ఇది ఇంకా అందుబాటులోవుంది.
అసలు ఏమి జరిగింది ?
TikTok ప్లాట్ఫారం నుండి లభించే అనేకమైన పాటలు మరియు మాటలకు సరిపడునట్లు లిప్ సింక్ చేసి, సరదా వీడియోలను క్రియేట్ చెయ్యడం వంటి లక్ష్యంతో వచ్చినటువంటి ఈ చైనీయ ఆప్, భారతదేశంలోని యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వున్నా వినియోగదారుల్లో 35 కంటే అధిక శాతం వినియోగదారులు మన భారతీయులంటే నమ్మగలరా? కానీ ఇది నిజం ఇది అంతగా నాటుకుపోయింది మనదేశంలో.
ఇంతవరకు బాగానే వుంది, కానీ ఎక్కువ శాతం యువత దీన్ని వివిధ రకాలైన మరియు విపరీతమైన తప్పుదోవలకు మళ్లించే వీడియోలను తియ్యడానికి విపయోగించడం పరిపాటిగా మొదలయ్యింది. ఇక్కడి నుండే కథ మొదలయ్యింది, దీని వలన పరువు పోయి కొంత మంది ఆత్మహత్య చేసుకోగా, వీడియోలు చిత్రించడం కోసం ప్రయోగాలు చేసి కొంత మంచి ప్రాణాలను కోల్పోయారు. ఇటీవల టిక్ టాక్ వీడియో చిత్రీకరణ సమయంలో అనుకోకుండా తుపాకీ పేలి ఢిల్లీ నగరంలో ఒకరు చనిపోయిన ఘటన ఉధాహరణగా చెప్పొచ్చు.
కేవలం ఇదొక్కటేకాదు, ఏం చేస్తున్నారో , తాము ఎలాంటి వీడియోలను తీస్తున్నారో తెలియని అయోమయ స్థితిలోకి యువత చేజారారు. కొన్ని వీడియోలను చూడడానికే సభ్యసమాజానికి జుగుప్స కలిగించేలా ఉంటాయి. ఇందులో అత్యధికంగా తమ జననాంగాలను చూపిస్తున్న వీడియోలు వైరల్ అవ్వడం, తరువాత అంట కంటే ఘాటుగా కామెంట్స్ రావడం మరల వాటి కోసం కేసులు పెట్టడం వంటి చేర్యలతో, ఈ టిక్ టాక్ పూర్తిగా అస్లీలత కోసమే వచ్చింది అన్నంతగా మారిపోయింది.
దీనితో యువత పూర్తిగా పెడదారిన పట్టడం మరియు అనేకమంది దీనికి బలవ్వడం గమనించిన తమిళనాడు న్యాయస్థానం దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సిందిగా, అత్యున్నత న్యాయస్థానాన్ని విన్నవించింది. దీని పైన స్పదించిన అత్యున్నత న్యాయస్థానం దీని పైన ఆంక్షలను విధించింది.