TikTok కి దక్కిన మరొక ఘనత

Updated on 15-Apr-2020
HIGHLIGHTS

సృజనాత్మక వీడియోలను క్రియేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు.

వీడియో క్రియేట్ మరియు షేర్ చేసే అప్స్ పైన ప్రజాదరణ వెల్లువలా  కనిపిస్తోంది. ఇప్పుడు మాట్లాడుతోంది టిక్‌టాక్ గురించి. ఈ ప్లాట్‌ఫారం ఇప్పుడు ఒక బిలియన్ కంటే ఎక్కువ సార్లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చెయ్యడింది. మార్కెట్ పరిశోధన సంస్థ అయితే, సెన్సార్ టవర్ గత ఏడాది నవంబర్‌ లో ఈ అప్లికేషన్ 1.5 బిలియన్ డౌన్‌లోడ్‌ లను దాటిందని నివేదించింది, అయితే ఇది iOS మరియు Android నుండి వచ్చిన సంఖ్యలను మొత్తంగా చూపించింది.

ప్రపంచం లాక్డౌన్లోకి వెళ్ళడం ప్రారంభించినప్పటి నుండి టిక్ టోక్ నిజంగా అధికంగా ప్రాచుర్యం పొందింది. ఎక్కువ మంది స్వయంగా సృజనాత్మక వీడియోలను క్రియేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. నిజం చెప్పాలంటే, ఈ సమయంలో, వారికి క్రియేటివ్ అవకాశాలు చాలా తక్కువ.

వాస్తవానికి, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్  మాదిరిగానే ఉంటుంది. కానీ, ఇది వివాదాలలో ఎక్కువ నిలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణాలల్లో, ఫేక్ వార్తలకు అతిపెద్ద అడ్రెస్స్ గా మారింది. ఇటీవల, టిక్‌టాక్‌లో తాము చూసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న COVID-19 కరోనావైరస్ కోసం ‘హోం రెమెడీ’ ప్రయత్నించిన తరువాత రెండు కుటుంబాలతో కూడిన 10 మంది ఆసుపత్రిలో చేరవలసివచ్చింది. డాతురా స్ట్రామోనియం(ఉమ్మెత్త) మొక్క యొక్క విత్తనాల నుండి తయారైన రసం తాగడం వల్ల వైరస్ దూరంగా ఉంటుందని ఈ వీడియో సారాంశం.

వాస్తవానికి, నకిలీ నివారణలు వేదికపై వ్యాప్తి చెందగల తప్పుడు సమాచారంలో ఒక భాగం మాత్రమే, ఇది COVID-19 వ్యాప్తి నుండి మొదలుకొని ఒక నిర్దిష్ట మతాన్ని నిందించే వ్యక్తుల గ్రూప్స్ వరకూ కలిగి ఉంటుంది. దీన్ని అరికట్టడానికి, తమ ప్లాట్‌ ఫామ్‌ లలో ఇలాంటి వార్తలను వ్యాప్తి చేసే వినియోగదారులను తొలగించాలని భారత ప్రభుత్వం టిక్‌టాక్, ఫేస్‌బుక్‌లను కోరింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :