భారత్ రైల్వే ఒక యాప్ ని తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు, దీని ద్వారా వెయిటింగ్ టికెట్ను కన్ఫర్మా లేదా అనే విషయం గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఒక అధికారి ఆదివారం దీని గురించి సమాచారం ఇచ్చారు . రైల్వే మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా మాట్లాడుతూ, "వెయిటింగ్ టికెట్ కన్ఫర్మా లేదా అని తెలియ పరిచే ఈ యాప్ పై రైల్వే పని చేస్తుంది .
ఈ అంచనా గత 13 సంవత్సరాల్లో ప్రయాణీకుల కార్యకలాపాలు మరియు బుకింగ్ నమూనా డేటాపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.
రైల్వే వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకునే సమయంలో వెయిటింగ్ టికెట్ కన్ఫర్మషన్ అయ్యిందా లేదా అనే దాని గురించి ఒక వినియోగదారుకి సమాచారం తెలియజేయడానికి రైల్వేస్ కోసం CRIS (రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం సెంటర్) మిశ్రమ అప్లికేషన్ లను అభివృద్ధి చేస్తోందని సక్సేనా తెలిపారు.
రైల్వే ప్రకారం, 13 లక్షల టిక్కెట్లను ప్రతిరోజూ బుక్ చేస్తే 10.5 లక్షల బెర్తుల అన్ని కేటగిరీలకు కేటాయించారు.