ఆండ్రాయిడ్ ఫోన్లలో డబ్బు దోచేస్తున్న ఒక ప్రముఖ APP : మీ ఫోన్లో ఉంటే ఇప్పుడే తీసేయండి
తన వినియోగదారుల డబ్బు దోచుకునే అవకాశం ఉన్నట్లు బయటపడింది.
ఈ మధ్యకాలంలో అనేకమైన సురక్షితం కానీ అప్లికేషన్స్ ని Google తన Play Store నుండి తొలిగించింది. వాస్తవానికి, ఈ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫారం వినియోగధారుల మొబైల్ ఫోన్లకు హానికరమైన యాప్స్ యొక్క నుండి రక్షించాడనికి సరైన మార్గాన్ని మాత్రం ఇంతవరకూ తీసుకురాలేదు. కానీ, తన దృష్టికి వచ్చిన మాల్వేర్ యాప్స్ ను మాత్రం వెనువెంటనే తొలిగిస్తుంది. కానీ, ఒకటి తొలగిస్తే మరొకటి పుట్టుకురావడం సర్వసాధారణం అయిపొయింది. ఇప్పుడు కొత్తగా ఇటువంటిదే మరొక యాప్ తన వినియోగదారుల డబ్బు దోచుకునే అవకాశం ఉన్నట్లు బయటపడింది.
ఈ విషయాన్ని Zee Business తెలిపింది. దీనిప్రకారం, మొబైల్ టెక్నాలజీ సంస్థ అప్ స్ట్రీమ్, ai.type keyboard అనే తన వినియోగదారులను దోచుకుంటున్నట్లుగా చెబుతునట్లు తెలుస్తోంది. ఈ పరిశోధకులు చెబుతున్న ప్రకారం, ఈ యాప్ దీన్ని ఉపయోగిస్తున్న వినియోగదారులు ప్రీమియం థర్డ్ పార్టీ యాప్స్ ని ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే సబ్స్క్రైబ్ చేసుతున్నట్లు కనుగొన్నారు. అంటే, మీకు తెలియకుండానే అటువంటి ప్రీమియం యాప్స్ కి డబ్బును చెల్లిస్తుంది, అంటే దోచుకుంటున్నది.
వాస్తవానికి, దీని పైన ఎన్నో కంప్లైంట్స్ రావడంతో, 2019 జూన్ నెలలో దీన్ని ప్లే స్టోర్ నుండి తొలగించారు. అయితే, అనేకరకాలైన థర్డ్ పార్టీ సోర్స్ ల ద్వారా ఇది ఇప్పటికి అందుబాటులో వుంది మరియు ఇంకా చాలా మొబైల్ ఫోన్లలో మనుగడ సాగిస్తోంది. ఇది మనకు తెలియకుండానే మన మొబైల్ ఫోన్ ద్వారా మనకు నష్టం కలిగిస్తుంది.