గూగుల్ ఇటీవల తన Goolge Play Store నుండి కనీసం 36 Camera Apps ను తొలగించింది. ఈ కెమెరా యాప్స్ వైరస్లను కలిగివున్నట్లు గుర్తించబడ్డాయి.ఈ కెమెరా యాప్స్ చాలావరకు 2019 మధ్యలో పబ్లిష్ చెయ్యబడ్డాయి. ఈ యాప్స్, ఇవి ఉచిత సర్వీస్ ఆఫర్ల చేయడానికి ప్రజలకు Ads చూపుతున్నాయి. ఒక రీసెర్చ్ పేపర్ వీటిపైన ఒక నివేదికను ప్రచురించిన తరువాత గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ లో ఎక్కువ భాగం సెల్ఫీలు మరియు బ్యూటీ సెల్ఫీల యాప్స్ కావడం విశేషం.
వీటితో పాటు, ప్రజలు ఈ యాప్స్ లో మాల్వేర్ ప్రకటనలను కూడా చూశారు. లక్షలాది మంది ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ల విషయం వైట్ ఆప్స్ నివేదించగా, ZDNet మొదట ఈ నివేదికను ప్రచురించింది. ఆశ్చర్యకరంగా, వీటిలో చాలా యాప్స్ ను ఒకే డెవలపర్ గ్రూప్ నిర్మించినట్లు ఈ నివేదిక కనుగొంది.
వినియోగదారులు ఈ యాప్స్ ను UnInstall చేయడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే, ఒక్కసారి ఫోన్‌లో ఈ యాప్స్ Install చేసిన తర్వాత అవి Skin నుండి అదృశ్యమవుతాయి. కాబట్టి, మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ 36 ఆండ్రాయిడ్ యాప్‌లలో దేనినైనా డౌన్‌లోడ్ చేసి ఉంటే, వాటిని వెంటనే మీ ఫోన్ నుండి తొలగించడం చాలా ముఖ్యం.
ఇది కెమెరా App. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి 1 లక్ష కన్నా ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది.
ఈ యాప్ 5 లక్షలకు పైగా డౌన్‌లోడ్స్ చేయబడింది. ఇది కూడా కెమెరా అప్లికేషన్.
ఈ యాప్ ఏకంగా 1 మిలియన్ కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లు నమోదుచేసింది. ఇప్పుడు Google Play స్టోర్ నుండి తొలగించబడ్డాయి.
ఈ యాప్ కూడా 10 లక్షలకు పైగా డౌన్‌లోడ్ చేయబడింది.
1 లక్షకు పైగా డౌన్‌లోడ్‌లతో ఫోటో కోలాజ్ & బ్యూటీ యాప్ కొనుగొనబడింది
5 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లతో బ్యూటీ కెమెరా సెల్ఫీ యాప్ కొనుగొనబడింది
10,000 డౌన్‌లోడ్‌లతో కనిపించిన బ్యూటీ కెమెరా యాప్ పొందండి
50,000 కి పైగా డౌన్‌లోడ్‌లతో పాండ్ సెల్ఫ్ బ్యూటీ కెమెరా యాప్ కొనుగొనబడింది
కార్టూన్ ఫోటో ఎడిటర్ &సెల్ఫీ బ్యూటీ కెమెరా యాప్ అత్యధికంగా 10 మిలియన్లకు(1కోటి) పైగా డౌన్‌లోడ్‌లతో కొనుగొనబడింది
10 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లను దాటిన బేంబూ సెల్ఫీ బ్యూటీ కెమెరా యాప్
గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించబడిన మరో 26 యాప్స్ కూడా ఉన్నాయి. కేవలం మూడు వారాల్లోనే 500,000 మందికి పైగా వినియోగదారులు ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.