టాటా సూపర్ యాప్ Tata Neu అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. అన్ని అవసరాలకు ఈ ఒక్క సూపర్ యాప్ చాలు. మెడిసిన్, లైఫ్ స్టైల్, కిరాణా, Flight టికెట్ బుకింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి అన్ని షాపింగ్ అవసరాలకు కూడా టాటా న్యూ సూపర్ యాప్ ఒక్కటిచాలు. "యాప్ ఒకటి, ప్రయోజనాలు / పనులు అనేకం" అని కంపెనీ దీని గురించి సింపుల్ గా చెబుతోంది. మరి టాటా న్యూ యాప్ ఎలా పనిచేస్తుంది, ఎటువంటి అవసరాలకు ఉపయోగపడుతుంది, అనే అన్ని విషయాలను గురించి తెలుసుకుందాం.
టాటా గ్రూప్ ఈ యాప్ సహాయంతో ప్రజలకు కొత్త మరియు విభిన్నమైన షాపింగ్ అనుభవాన్ని అందించాలని యోచిస్తోందని చెప్పవచ్చు. ఈ యాప్ ద్వారా చేసే ప్రతి కొనుగోల పైన ప్రయోజనాలను మరియు ఆఫర్లను కూడా అందుకుంటారు. ఈ యాప్ ద్వారా చేసే షాపింగ్ పైన NeuCoins పొందుతారు మరియు వీటిని యాప్ ద్వారా రిడీమ్ కూడా చేసుకోవచ్చు. 1 NeuCoins అంటే 1 రూపాయి గా పరిగణించబడుతుంది.
టాటా న్యూ అనేది ఒక యూనిఫైడ్ ప్లాట్‌ఫారమ్ మరియు మీరు అన్ని టాటా గ్రూప్ షాపింగ్ యాప్ లకు ఒకే చోట యాక్సెస్ పొందుతారు. ఈ యాప్ Android మరియు iOS యూజర్లు ఇద్దరికీ అందుబాటులో ఉంది. ఈ యాప్ సహాయంతో మీరు ఈ క్రింది తెలిపిన లావాదేవీలను చేయవచ్చు.
పైన్ తెలిపిన షాపింగ్ మరియు ట్రావెలింగ్ మరియు టికెట్ బుకింగ్ లతో పాటుగా Tata Pay తో అన్ని పేమెంట్ మరియు మని ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు.
మల్టిపుల్ టాటా బ్రాండ్ యాప్స్ ద్వారా ఆన్లైన్ వెబ్సైట్ మరియు షాపుల ల వద్ద UPI, EMI మరియు NeuCoin తో పేమెంట్ చేయవచ్చు. అలాగే, లోకల్ స్టోర్ లు, సినిమా థియేటర్లు లేదా మరింకెక్కడైనా సరే Tata Pay UPI తో QR Code స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు. అలాగే, ఎలక్ట్రిసిటీ, మొబైల్, DTH, బ్రాండ్ బ్యాండ్ బిల్ వంటి అన్ని అవసరాలకు టాటా న్యూ ఉపయోగపడుతుంది. అంతేకాదు, మొబైల్ నంబర్ తో మీకు కావాల్సిన వారికీ మని ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు.