వాట్సాప్ త్వరలోనే రెండు కొత్త ఫీచర్లను జత చెయ్యడానికి చూస్తున్నట్లు WABetaInfo వెల్లడించింది. ఇటీవల కాలంలోనే వెంట వెంటనే కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్, మరో రెండు కొత్త ఫీచర్లను కూడా త్వరలోనే జత చెయ్యాలని చూస్తునట్లు తెలిపింది. గత రెండు నెలల్లో వాట్సాప్ యూజర్ల కోసం అనువైన మరియు అవసరమైన ఫీచర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మరో రెండు కొత్త ఫీచర్లతో మరింత అనుకూలతను యూజర్లకు అందించే ప్రయత్నం వాట్సాప్ చేస్తునట్లు ఈ నివేదిక తెలిపింది.
వాట్సాప్ త్వరలో తీసుకు రానున్నట్లు చూస్తున్న కొత్త ఫీచర్లలో ఒకటి వాట్సాప్ యూజర్ నేమ్ కాగా మరొకటి స్క్రీన్ షేరింగ్ ఫీచర్. ఈ రెండు ఫీచర్లను రానున్న కొత్త అప్డేట్ లతో జత చెయ్యవచ్చని WABetaInfo తెలిపింది మరియు వీటికి సంభంధించిన స్క్రీన్ షాట్ లను కూడా యాతన ట్విట్టర్ అకౌంట్ నుండి పంచుకుంది.
ఈ స్క్రీన్ షాట్ ట్వీట్ ను ఇక్కడ చూడవచ్చు.
https://twitter.com/WABetaInfo/status/1661478537696800768?ref_src=twsrc%5Etfw
దీని ప్రకారం యూజర్ మొబైల్ నెంబర్ స్థానంలో యూజర్ నేమ్ ను జత చేసేలా ఈ కొత్త ఫీచర్ ను యాడ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ ను ప్రొఫైల్ లో వస్తుందని ఈ స్క్రీన్ షాట్ లో చూపించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వారికి నచ్చిన యూజర్ పేరుతో వారి అకౌంట్ లో ప్రొఫైల్ ను సెట్ చేసుకోవచ్చు.
https://twitter.com/WABetaInfo/status/1662371053153157120?ref_src=twsrc%5Etfw
ఇక రెండవ ఫీచర్ వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ విషయానికి వస్తే, క్రింద ఉండే నేవిగేషన్ బార్ లో ఈ ఫీచర్ యద అవుతుంది. దీని ద్వారా యూజర్లు వారి స్క్రీన్ ను పెద్ద స్క్రీన్ పైన షేర్ చేసుకునే వీలుంటుంది.