వాట్స్ఆప్ చాటింగ్ లో ఎక్కుగా ఉపయోగించేది ఎమోజిస్ లేదా యానిమేషన్స్. అదే, స్నేహితులు లేదా ఇష్టమైన వారితో చాటింగ్ చేసేప్పుడు అయితే, ఇంకా ఎక్కువగా వీటిని ఉపయోగిస్తాము. అయితే, ఇప్పటి వరకూ మీరు డిఫాల్ట్ ఎమోజిస్ లేదా యానిమేషన్స్ మాత్రమే ఉపయోగించి ఉంటారు. కానీ, ఇప్పుడు కొత్తగా ట్రై చేయవచ్చు. మీ ఫోటోలు లేదా వీడియోలనే ఎమోజి లేదా యానిమేషన్ గా మార్చి పంపించవచ్చు. ఇది మీ ఫ్రెండ్స్ లేదా మీకు ఇష్టమైన వారికీ చాలా సర్ప్రైజింగా వుంటుంది.
అందుకే ఈరోజు ఈ ట్రిక్ ఎలా చేయాలో చూద్దాం. దీని కోసం మీరు ఎక్కువగా కష్టపడాల్సిన ఆవాసరం లేదు. గూగుల్ ప్లే స్టోర్ నుండి Animated Sticker Maker WAStickerApps ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. ఈ యాప్ ఓపెన్ చేసిన తరువాత మీకు యానిమేషన్ క్రియేషన్ అప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోన్ గ్యాలరీ నుండి మీకు కావాల్సిన ఫోటో లేదా వీడియోను ఎంచుకొని సేవ్ చేయాలి.
తరువాత, వాట్స్ఆప్ స్టిక్కర్స్ అప్షన్ లో మీరు సేవ్ చేసిన వీడియో యొక్క వీడియో టూ యానిమేటెడ్ స్టిక్కర్స్ అప్షన్ కనిపిస్తుంది. ఇక మీకు కావాల్సిన వీడియోలు మరియు ఫోటోలను మీకు నచ్చినట్లుగా స్టికర్ గా మార్చుకొని మీ స్నేహితులు మరియు ఇష్టమైన వారికీ లేదా ఇంకెవరికైనా సరే పంపించవచ్చు.