AI DJ ఫీచర్ పరిచయం చేసిన Spotify..ఇలా సెట్ చేసుకోండి| Tech news
మ్యూజిక్ ప్రియులకు సుపరిచితమైన Music App Spotify కొత్తగా AI DJ ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ మ్యూజిక్ ప్రియులకు మరింత సౌకర్యం మరియు సౌలభ్యంతో పాటుగా గొప్ప మ్యూజిక్ ను కూడా అందిస్తుంది. స్పోటిఫై తీసుకు వచ్చిన DJ ఫీచర్ అనేది ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డిజె టూల్. ఈ కొత్త ఫీచర్ తో మీరు కోరుకునే లేదా వినాలనుకునే మ్యూజిక్ ను పసిగట్టి మీకోసం ఆటొమ్యాటిగ్గా ప్లే చేస్తుంది. దీనికోసం, ఈ స్పోటిఫై ఎఐ డిజె మీరు ఇప్పటి వరకూ ఎక్కువగా వినడానికి ఇష్టపడిన మరియు మీ లైక్స్ తో పాటుగా ఓల్డ్ ట్రాక్ రికార్డ్ లను ఉపయోగిస్తుంది.
What is Spotify AI DJ
మ్యూజిక్ లవర్స్ కి బాగా నచ్చిన ఈ యాప్ లో కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూనే వుంది. ఇదే దారిలో స్పోటిఫై ఎఐ డిజె ఫీచర్ ఇప్పుడు భారతీయ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ స్పోటిఫై ఎఐ డిజె ఫీచర్ టెక్స్ట్ టూ స్పీచ్ టెక్ తో వస్తుంది. అంటే, మీ మ్యూజిక్ సెర్చ్ మరింత వేగంగా సౌకర్యవంతంగా మారుతుంది. మీరు హెడ్ ఫోన్ ను ఉపయోగిస్తున్నప్పుడు మ్యూజిక్ సెర్చ్ కోసం ఈ కొత్త స్పోటిఫై ఎఐ డిజె ఫీచర్ మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
స్పోటిఫై ఎఐ డిజె ఫీచర్ ఎలా సెట్ చేసుకోవాలి?
ఇక ఈ స్పోటిఫై ఎఐ డిజె ఫీచర్ ను మీ ఫోన్ లో ఎలా సెట్ చేసుకోవాలి? అని అనుకుంటే, ఇది చాలా సింపుల్ అని నేను చెబుతాను. ఎందుకంటే, స్పోటిఫై యాప్ లోని హోమ్ బటన్ లో కనిపించే Music బటన్ పైన నొక్కగానే AI DJ కార్డ్ వస్తుంది. అంతే, మీ స్ఫోటిఫై యాప్ లో మీ ఎఐ డిజె ఫీచర్ ఎనేబుల్ అయిపోతుంది. అంతే, Play బటన్ పైన నొక్కగానే మీ AI మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది.
అయితే, ఈ స్పోటిఫై ఎఐ డిజె ఫీచర్ యాక్సెస్ కేవలం Premium Users కి మాత్రమే అందుతుంది. అంటే, మీరు స్పోటిఫై ప్రీమియం ఎఐ డిజె ఫీచర్ ను పొందడానికి ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను కలిగి ఉండాలి.
Also Read: Gold Rate: కుప్పకూలిన బంగారం ధర..నాలుగు నెలల కనిష్ఠానికి సూచీలు.!