గూగల్ Now అండ్ ఆపిల్ సిరి కన్నా ఫాస్ట్ వాయిస్ అసిస్టంట్ యాప్ వచ్చింది: రిపోర్ట్స్
SoundHound కంపెని Hound పేరుతో కొత్త వాయిస్ అసిస్టంట్ యాప్ ను డెవలప్ చేసింది. ఇది ప్రస్తుతం us ప్లే స్టోర్ users కు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ వస్తుంది అని అంచనా.
మన దేశంలో రాకుండా మనకు ఎందుకు ఈ న్యూస్ అని అనుకోకండి. ఇది ఆపిల్ సిరి మరియు గూగల్ Now కన్నా చాలా ఫాస్ట్ గా వాయిస్ ను రికాగ్నైజ్ చేస్తుంది అని రిపోర్ట్స్.
కొంతమంది ఇది గూగల్ మరియు ఆపిల్ వాయిస్ అసిస్టంట్ లకు చాలా దూరంగా ఉంది బెటర్ మెంట్ లో అని తెలిపారు. గతంలో ఇదే కంపెని మ్యూజిక్ సర్చ్ యాప్ ను డెవలప్ చేసింది.
Hound మీరు ఏదైనా మాట్లాడితే live లోనే translate చేస్తుంది. దీనిని speech to meaning అని అంటారు. అందుకే ఫాస్ట్ గా ఉంది అని కంపెని సీఈఓ అన్నారు.
ఇంతకుముందు ఉన్న వాయిస్ assistants ముందు వాయిస్ ను text రూపంలోకి ట్రాన్స్ లేట్ చేసి అప్పుడు మైనింగ్ వైజ్ గా రియాక్షన్స్ ఇచ్చేవి. కంపెని వాళ్ళతో దీని ఇండియన్ రిలీజ్ పై అడగటం జరిగింది. వారి రిప్లై ఇస్తే మరొక స్టోరితో మీ ముందుకు వస్తాము.