నోట్స్ బాన్ తరువాత online షాపింగ్ సైట్స్ అన్నీ కాష్ ఆన్ డెలివరీ పేమెంట్స్ ను మానివేసాయి. దీని గురించి కంప్లీట్ స్టోరీ ఈ లింక్ లో తెలుసుకోగలరు.
అయితే COD లేకపోతే చాలామందికి ఇబ్బంది అనేది వాస్తవం. ఎందుకంటే కేవలం సెక్యూరిటీ ఒకటే కాకుండా ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ లేకపోవటం అనే కారణాలతో ఇంకా చాలామంది ఉన్నారు.
అయితే దీనికి సొల్యూషన్ తీసుకువస్తూ స్నాప్ డీల్ wallet on delivery ఆప్షన్ ను ప్రవేశపెట్టింది నిన్న. అంటే COD పేమెంట్ లో ఆర్డర్ బుక్ చేసి, ఇంటికి ఐటెం వచ్చినప్పుడు…
FreeCharge wallet(స్నాప్ డీల్ దీనిని కొనేసింది) లో మీరు అప్పటికప్పుడు అమౌంట్ వేసి pay చేయగలరు. డెలివరి బాయ్స్ ఐటెం తీసుకువచ్చినప్పుడు మీకు ఆటోమాటిక్ గా ఒక PIN కోడ్ వస్తుంది.
దానిని ఎంటర్ చేస్తే మీరు ఫ్రీ చార్జ్ wallet లో ఆల్రెడీ యాడ్ చేసిన అమౌంట్ లో నుండి ఐటెం కు ఎంత pay చేయాలో అంత కట్ అవుతుంది.
అయితే స్నాప్ డీల్ అనౌన్స్ చేసిన వెంటనే Paytm కూడా POD(Paytm on delivery) అనే పేరుతో ఈ పద్దతిని ప్రవేశపెట్టింది.