స్నాప్ డీల్ సైట్ కొత్త 2000 రూ నోట్లను కూడా ఇంటికి డెలివరి ఇస్తుంది. అంటే ఐటమ్స్ ను డెలివర్ చేసినట్లు. నోట్స్ డెలివరీ కోసం మీరేమి ఐటెం కొననవసరం లేదు.
అయితే ప్రస్తుతానికి కేవలం అతి కొద్ది ఏరియాస్(బెంగుళూరు, గురుగ్రాం/గూర్గావ్) లోనే ఇది అమల్లో ఉంది. ఈ కొత్త అవకాశం పేరు Cash@Home అని పెట్టింది స్నాప్ డీల్. ఈ రోజే ప్రారంభం.
ఏలా పనిచేస్తుంది/వాడుకోవాలి ఇది?
ఫోన్ లో స్నాప్ డీల్ యాప్ ఇంస్టాల్ చేస్తే మీ లొకేషన్ తెలుసుకొని, మీ ఏరియా లో కాష్@home ఉందా లేదా అని అనాలిసిస్ చేసి ఉంటే కనుక మీకు మెసేజ్ & నోటిఫికేషన్ పంపి మిమ్మల్ని ఆర్డర్ పేజ్ వద్దకు తిసుకువెళ్తుంది.
ఇక్కడ మీరు ఒక్క రూపాయి pay చేయాలి డెబిట్ కార్డ్ ద్వారా లేదా ఫ్రీ చార్జ్ wallet ద్వారా. మరుసటిరోజు స్వైపింగ్ మిషన్ తో మీ ఇంటికి స్నాప్ డీల్ బాయ్స్ వస్తారు.
అక్కడే మీ వద్ద ఉన్న atm కార్డ్స్ తో స్వైప్ చేస్తే వాళ్ళకు అమౌంట్ చేరిపోతుంది, మీ చేతిలో 2000 రూ కాష్ పెడతారు. ఎంత స్వైప్ చేస్తే అంతే ఇస్తారు. రోజుకు 2000 రూ మాత్రమే లిమిట్ ఉంది.
ఇదే అవకాశం grofers వంటి కిచెన్ వస్తువులు, కాయగూరలు అందించే యాప్/వెబ్ సైట్ సర్విస్ కూడా అందిస్తుంది. కాని groceries ఆర్డర్ చేస్తేనే కాష్ డెలివరి కూడా చేసేది. స్నాప్ డీల్ లో ఏమీ ఆర్డర్ చేయకపోయినా తీసుకోగలరు.