అదనపు ఖర్చు ఏమీ లేకుండా ఫ్రీ షిప్పింగ్ మరియు next day డెలివరీ అందిస్తుంది snapdeal gold

Updated on 29-Aug-2016

అమెజాన్ PRIME పేరుతో ఈ మధ్యనే, ఫ్రీ షిప్పింగ్ మరియు మరుసటిరోజు డెలివరీ వంటివి అందిస్తూ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లాంచ్ చేసింది ఇండియాలో. ఇప్పుడు snapdeal కూడా ఇదే ఫార్ములా ను snapdeal gold పేరుతో ప్రవేసపెట్టింది.

ఏమున్నాయి గోల్డ్ సర్వీస్ పేరుతో వచ్చే సదుపాయాలు?

  • ఐటెం ఈ రోజు కొంటే రేపే డెలివరీ ఉంటుంది. అయితే ఇది కొన్ని సిటీస్ లోనే.
  • షిప్పింగ్ చార్జెస్ ఏమీ ఉండవు.
  • అదనంగా 14 రోజులు యాడ్ అవుతాయి రిటర్న్స్ కు. సాధారణంగా 7 రోజులు ఉంటాయి రిటర్న్స్ కు.
  • ఐటెం పంపే ముందు క్వాలిటీ బాగుందో లేదో స్పెషల్ గా చూసి పంపటం జరుగుతుంది అని చెబుతుంది స్నాప్ డీల్.

అయితే ఇవన్నీ SD+ అని ఉన్న ఐటమ్స్ కు మాత్రమే. SD+ అంటే snapdeal fulfilled. దీనిలోని సర్వీసెస్ ను ఆస్వాదించడానికి ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. SD+ లోగో ఉన్న ఐటెం ను COD అని కాకుండా మరే ఇతర మోడ్ లో పేమెంట్ చేసినా ఆటోమాటిక్ గా గోల్డ్ సదుపాయాలు పొందగలరు.

సెలెక్ట్ సిటీస్ ఏంటి అని తెలుసుకోనవసరం లేకుండా మీరు కొనదలుచుకున్న SD+ సింబల్ కలిగిన ప్రోడక్ట్ దగ్గర pincode ఎంటర్ చేస్తే, next day డెలివరీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. Nextday డెలివరీ లేకపోయినా ఫ్రీ షిప్పింగ్ మాత్రం ఉంటుంది.

అఫిశియల్ గా సమాచారం కొరకు స్నాప్ డీల్ పైన చెప్పిన సమాచారాన్ని అంతటినీ ఈ లింక్ లోకి వెళ్లి చూడగలరు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :