మైక్రోసాఫ్ట్ స్కైప్ లో కాల్ రికార్డింగ్ ఫీచర్లపై పని చేస్తుంది, ఇది థర్డ్ పార్టీ యాప్స్ తో ఏకీకరణను సులభతరం చేస్తుంది, ఇందులో వైర్ కోస్ట్ మరియు విమిక్స్ ప్రధానముగా ఉన్నాయి.
స్కైప్ బ్లాగ్ పోస్ట్ లో, విండోస్ 10 మరియు మాక్ వినియోగదారులు ఇప్పుడు డెస్క్టాప్ స్కైప్ క్లయింట్ను 'Content Creator' మోడ్కు మార్చడం ద్వారా కాల్ రికార్డు చేయవచ్చు మరియు అడోబ్ ప్రీమియర్ ప్రో మరియు అడోబ్ ఆడిషన్ వంటియాప్ ద్వారా ఇంపోర్ట్ చేసి ఎడిట్ కూడా చేయవచ్చు .
క్రొత్త కాల్స్ రికార్డు ఫీచర్తో పాటు, స్కైప్ ఇప్పుడు YouTube ఛానల్ లేదా ట్విచ్ స్ట్రీమ్లో కాల్ యొక్క ప్రత్యక్ష ప్రసారంను అనుమతిస్తుంది, మరియు ఈ సమయంలో కాల్ యొక్క రూపాన్ని లేదా అనుభూతిని అనుకూలపరచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
బ్లాగ్ పోస్ట్ లో చెప్పినట్లుగా " యూజర్స్ కాల్ లుక్ మరియు ఫీల్ ని కస్టమైజ్ చేయవచ్చు . "అందువల్ల వారు అన్ని రకాల వీక్షకులకు ప్రత్యక్ష ప్రసారానికి ప్రసారం చేయగలరు.