వాట్సాప్ ఆఫ్ లైన్: ఇంటర్నెట్ ఆఫ్ చెయ్యకుండానే వాట్సాప్ ఆఫ్ లైన్ చేయ్యవచ్చు..!!

Updated on 07-Apr-2022
HIGHLIGHTS

వాట్స్ఆప్ లో యూజర్లకు తెలియని బెస్ట్ ట్రిక్స్ చాలానే ఉన్నాయి

మీ అవసరాన్ని బట్టి కొన్ని ట్రిక్స్ మీకు ఉపయోగపడతాయి

మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే Whatsapp ని ఆఫ్ చేయవచ్చు

వాట్స్ఆప్ లో మనకు ఉపయోగపడే మరియు యూజర్లకు తెలియని బెస్ట్ ట్రిక్స్ చాలానే ఉన్నాయి. అన్ని సమయాల్లో అన్ని ట్రిక్స్ ఉపయోగపడక పోయినా మీ అవసరాన్ని బట్టి కొన్ని ట్రిక్స్ మీకు ఉపయోగపడతాయి. అందుకే, ఈరోజు మీకు అత్యవసర సమయంలో ఉప్పయోగపడే బెస్ట్ ట్రిక్ చెప్పబోతున్నాను. ఈ ట్రిక్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే Whatsapp ని ఆఫ్ చేయవచ్చు. మీరు ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్ప్పుడు ఎక్కువగా వచ్చే Whatsapp నోటిఫికేషన్ల నుండి ఈ ట్రిక్ తో తప్పించుకోవచ్చు.  

నెట్ ఆఫ్ చెయ్యకుండా Whatsapp ఆఫ్ చెయ్యడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి Pause It App డౌన్ లోడ్ చేసి ఉపయోగించ వలసి వుంటుంది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో 4 స్టార్ రేటింగ్ తో వుంది. అయితే, తర్డ్ పార్టీ యాప్ ని ఉపయోగించడం సేఫ్ అని మీరు అనుకుంటే మాత్రమే ఈ విధంగా చేయండి. ఈ యాప్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే మీ వాట్స్ఆప్ ను ఆఫ్ చెయ్యవచ్చు.

దీనికోసం మీరు మీరుచేయవల్సిందల్లా యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేయ్యడమే. తరువాత, యాప్ లో Active Apps పైన ఉన్న టోగుల్ బటన్ ని నొక్కితే చాలు మీకు కావాల్సిన యాప్స్ డేటా ఆఫ్ అవుతుంది. అంతేకాదు,  మీరు ఎంత సమయం మీ వాట్స్ఆప్ ని ఆఫ్ చేయాలనుకుంటారో అంత టైం ను కూడా సెట్ చేసుకోవచ్చు.

డేటా ఖర్చు చేయకుండా వాట్స్ఆప్ ఉపయోగించాలి అంటే కూడా ఒక ట్రిక్ వుంది.

ఈ విధంగా చేస్తే మీరు వాట్సాప్‌ లో డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు

మొదట వాట్సాప్ తెరిచి, పైన ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కండి.

ఇప్పుడు సెట్టింగులకు వెళ్లి డేటా మరియు స్టోరేజ్ ఎంపికను ఎంచుకోండి.

ఇక్కడ ఇచ్చిన తక్కువ డేటా వాడకంలో, మీరు కాల్ ఇన్ డేటాను తగ్గించుకునే ఎంపికను పొందుతారు, దాని ప్రక్కన ఇచ్చిన టోగిల్‌ను ఆన్ చేయండి.

అదేవిధంగా, మీరు వాట్సాప్‌లోని ఫోటోలు మరియు వీడియోల నుండి డేటా వినియోగాన్ని కూడా నిరోధించవచ్చు.

దీని కోసం మీరు మళ్ళీ సెట్టింగులకు వెళ్ళాలి.

ఇప్పుడు మీరు డేటా మరియు స్టోరేజి వినియోగంపై క్లిక్ చేయాలి.

ఇప్పుడు మొబైల్ డేటా ఎంపికను ఉపయోగించి లోపలికి వెళ్లి అన్ని బాక్స్ ల పక్కన ఎంపికను తీసివేయండి.

అదేవిధంగా Wi-Fi లో కనెక్ట్ అయినప్పుడు మరియు రోమింగ్ చేసేటప్పుడు రెండు ఇతర ఎంపికలలో ఒకే విధానాన్ని పునరావృతం చేయండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :