మొబైల్ లో e - wallet లాంటిది.
స్టేట్ బ్యాంక్ నుండి కొత్తగా నిన్న మొబైల్ wallet లాంచ్ అయ్యింది. దీని పేరు state bank Buddy. ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఫోనులకు మాత్రమే లభిస్తుంది. ఈ లింక్ నుండి Buddy యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు (19 ఆగస్ట్) మధ్యాహ్నం 3PM గంటల లోపు Buddy యాప్ ను ఇంస్టాల్ చేసుకొని రిజిస్టర్ అయితే బ్యాంక్ నుండి మీకు 100 రూ ఉచితంగా వస్తాయి.
3.4 స్టార్ రేటింగ్ తో ప్లే స్టోర్ లో 4.63 MB సైజ్ లో ఉంది అప్లికేషన్. 2G ఇంటర్నెట్ కనెక్షన్ లో 5 నిముషాలు పడుతుంది మీ ఆండ్రాయిడ్ ఫోనులో డౌన్లోడ్ చేసుకోవటానికి. దీనికి వెబ్ సైటు కూడా. ఈ లింక్ లో దొరుకుతుంది వెబ్ సైటు.
ఇంతకీ స్టేట్ బ్యాంక్ Buddy అప్లికేషన్ ఏమి చేస్తుంది?
ముందుగా చెప్పాలంటే అన్నీ wallet అప్లికేషన్స్ చేసే పనులే అధికంగా ఇదీ చేస్తుంది.
1. మీ ఫోనులో కాని ఫేస్ బుక్ లో కాని ఉన్న స్నేహితులకు buddy యాప్ ద్వారా మనీ పంపగలరు
2. మూవీ మరియు ట్రావెల్ టికెట్లను బుక్ చేసుకోవటం, ఆన్ లైన్ షాపింగ్ చేయటం, మొబైల్ రీచార్జ్ చేసుకోవటం.
3. మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఇందులోకి మనీ ట్రాన్సఫర్ చేయటం.
4. ఫ్రెండ్స్ లేదా ఫేమిలీ మెంబర్స్ ను మనీ అడిగి తీసుకోవటం. వాళ్ళకి ట్రాన్సఫర్ చేయటం.
ఏలా పనిచేస్తుంది?
జస్ట్ మీ ఫోన్ నంబర్ తో డిటేల్స్ ను సబ్మిట్ చేసి సైన్ అప్ ( ఫస్ట్ టైమ్ యూజర్స్) అవ్వండి.
ప్రస్తుతానికి makeMytrip వెబ్ సైటు నుండి కాని యాప్ నుండి కాని ఫ్లైట్ మరియు హోటల్ బుకింగ్స్ పై 15% మరియు 50% కాష్ బ్యాక్ ఆఫర్స్ ను ఇస్తుంది స్టేట్ బ్యాంక్ buddy wallet. wallets లో ఎప్పటికప్పుడు ఆఫర్స్ వస్తూ ఉంటాయి.
మొత్తం 13 బాషలలో ఉంది యాప్. నా ఫోన్ root చేసిన కారణంగా, sbi buddy అప్లికేషన్ పనిచేయటం లేదు. సో మీలో ఎవరైనా ఫోన్ కు రూటింగ్ చేస్తే ఇది పనిచేయదు. రూటింగ్ అంటే ఏంటో ఈ లింక్ లో తెలుసుకోండి.