స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకూ మొబైల్ యాప్స్ కేటగిరి లో చాలా యాప్స్ లాంచ్ చేసింది. వాటిలో బాగా ఉపయోగపడేవి.. స్టేట్ బ్యాంక్ anywhere, స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్, స్టేట్ బ్యాంక్ బడ్డీ.
వీటితో పాటు మరొక 9 యాప్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ ఫోన్లకు. అవేంటో చూడాలంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. ఇవ్వన్ని స్మార్ట్ ఫోన్ పై పని చేస్తాయి. మరి స్మార్ట్ ఫోన్ లేని వారి సంగతేమిటి?
అదే ఆలోచనతో ఇప్పుడు Batua పేరుతో Feature (నార్మల్) ఫోన్స్ పై పని చేసే యాప్ ను డెవలప్ చేసింది. ఇది sbi buddy మాదిరి గానే మొబైల్ wallet. కాకపోతే ఫీచర్ ఫోన్లలో వర్క్ అవుతుంది.
దీనితో పే మెంట్స్, ఫండ్స్ ట్రాన్స్ ఫర్స్ అండ్ ఎయిర్ టికెట్స్ వంటి పనులు చేసుకోగలరు. మరో 3 వారాలలో ఇది అందరికీ అందుబాటులోకి వస్తుంది. మొత్తం 13 భాషలలో విడుదల కానుంది. పైన ఉన్న ఇమేజ్ స్మార్ట్ ఫోన్ లలో పని చేసే SBI buddy. కానీ అవే ఫీచర్స్ నార్మల్ ఫోనుల్లో కూడా రానున్నాయి Batua సాఫ్ట్ వేర్ యాప్ ద్వారా.