వాట్స్ అప్ వచ్చి 7 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికీ. దిని బర్త్ డే రోజు ఫేస్ బుక్(వాట్స్ అప్ ను ఫేస్ బుక్ కొనటం జరిగింది), కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది వాట్స్ అప్ సపోర్ట్ పై.
2009 లో వాట్స్ అప్ మొదలు పెట్టినప్పుడు అప్పటి ఆపరేటింగ్ సిస్టంస్ డిఫరెంట్ గా ఉండేవి. అప్పుడే ఆపిల్ మార్కెట్ లో అడుగుపెట్టగా 70 శాతం మొబైల్స్ నోకియా అండ్ బ్లాక్ బెర్రీ os లపై రన్ అయ్యేవి.
అయితే ఇప్పుడు గూగల్, ఆపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ తమ os లతో మార్కెట్ లో 99.5 % సేల్స్ తో ఉన్నారు. సో వాట్స్ అప్ కు మేజర్ గా వాడుతున్న users కు మాత్రమే సపోర్ట్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది.
2016 చివరికల్లా బ్లాక్ బెర్రీ (including లేటెస్ట్ వెర్షన్ BB 10), నోకియా S40, నోకియా symbian S60, ఆండ్రాయిడ్ 2.1, 2.2 అండ్ విండోస్ 7.1 os లపై వాట్స్ అప్ కు సపోర్ట్ ఆగిపోతుంది కంపెని నుండి.