రిలయన్స్ యొక్క JioBrowser ఎనిమిది భారతీయ భాషలకు సపోర్ట్ అందిస్తోంది

Updated on 08-Jan-2019
HIGHLIGHTS

ఆండ్రాయిడ్ లో లభించే జియోబ్రౌజర్, వినియోగదారులు వారికి నచ్చిన స్థానిక భాషలో వార్తలను ఎంచుకునే ఫీచరును కలిగివుంది.

ముఖ్యాంశాలు:

1. Android కోసం రిలయన్స్ JioBrowser ఎనిమిది భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది 

2. ఇది వారి స్థానిక వార్తా ఫీడ్ ను వినియోగదారుని కావాల్సిన భాషను ఎంచుకునేలా అనుమతిస్తుంది

3. దీనిపైన యూజర్ యొక్క అభిప్రాయం సేకరణ స్వీకరిస్తోంది 

రిలయన్స్ జీయో ఇన్ఫోకాం, ఇటీవల ఎనిమిది భారతీయ భాషలకు మద్దతునిస్తుంది, వీటిలో హిందీ, గుజరాతి, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు బెంగాలీ భాషలు ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన JioBrowser కేవలం 4.8 MB పరిమాణాన్ని కలిగి ఉంది, ఇది ప్రవేశ-స్థాయి Android స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకు కూడా అనుకూలంగా ఉంది. ఈ బ్రౌజర్ కూడా వారు ఎంచుకున్న అంశాల గురించి కస్టమైజ్ అప్డేట్స్ పొందడానికి వారి వార్తల ఫీడ్ను సరిచేసుకునే లక్షణంతో వస్తుంది.

"భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేసిన, మొదటి భారతీయ బ్రౌజర్లలో జీయో చే అందించబడిన JioBrowser ఒకటి. ఇది ఒక వేగవంతమైనది మరియు తక్కువ మెమొరీతో సులభంగా ఉపయోగించగలిగే బ్రౌజర్.  ఈ రోజు దీన్ని ఇన్స్టాల్ చేయండి మరియు ప్రతిరోజూ అత్యంత ఆకర్షణీయమైన వీడియోలు మరియు తాజా వార్తలు కంటెంట్ను అనుభవించండి,అని "Google Play Store లో ఈ App యొక్క వివరణ చెబుతుంది. ఈ డెవలపర్ UI నిపుణుల బృందం "సున్నితమైన మరియు వేగవంతమైన బ్రౌజింగ్ అనుభవం." కోసం రూపకల్పన చేయబడిందని చెబుతున్నారు. 

ఇంటర్నెట్లో అగ్ర భారత వెబ్సైట్లకి కొన్ని సమీకృత క్విక్ లింక్లతో వస్తుంది ఈ JioBrowser. వినియోగదారులు వారి బ్రౌజింగ్ హిస్టరీని ప్రొటెక్ట్ చేయడానికి వీలుగా  అనుమతించే ఒక అజ్ఞాత మోడ్ కూడా ఉంది. వినియోగదారులు బ్రౌజర్ నుండి వారి డౌన్లోడ్లు మరియు హిస్టరీని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. టీం JioBrowser కూడా క్రొత్త లక్షణంతో పని చేస్తున్నట్లు అనిపిస్తుంది మరియు వెంటనే Jiobrowser కోసం అప్డేట్ త్వరలో విడుదల చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :