ఇండియాలో TIK TOK పగ్గాలు Reliance చేతికి ఇవ్వనుందా?

ఇండియాలో TIK TOK పగ్గాలు Reliance చేతికి ఇవ్వనుందా?
HIGHLIGHTS

TIK TOK ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన షార్ట్ వీడియో యాప్

భారతీయుల డేటా సెక్యూరిటీ పరంగా TIK TOK పైన వచ్చిన సెక్యూరిటీ ఆరోపణల కారణంగా ఇండియాలో ఈ యాప్ పూర్తిగా బ్యాన్ చేయబడింది.

బైట్ ‌డాన్స్ తన వీడియో ఆధారిత యాప్ టిక్‌ టాక్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో ముందస్తు చర్చలు జరుపుతున్నట్లు అనేక నివేధికలు చెబుతున్నాయి.

జూన్ వరకూ, ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన షార్ట్ వీడియో యాప్ TIK TOK గురించి తెలియని వారుండరు. అయితే, చైనా -భారత్  మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం తరువాత, భారతీయుల డేటా సెక్యూరిటీ పరంగా దీని పైన వచ్చిన సెక్యూరిటీ ఆరోపణల కారణంగా ఇండియాలో ఈ యాప్ పూర్తిగా బ్యాన్ చేయబడింది. కానీ, చైనాకు చెందిన బైట్ ‌డాన్స్ తన వీడియో ఆధారిత యాప్ టిక్‌ టాక్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో ముందస్తు చర్చలు జరుపుతున్నట్లు అనేక నివేధికలు చెబుతున్నాయి.

ముందుగా, ఈ విషయాన్ని TechCrunch వెల్లడించింది.  ఈ నివేదిక ప్రకారం, గత నెలాఖరులో రెండు సంస్థలు కూడా చర్చలు ప్రారంభించాయి, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు మరియు పెట్టుబడి విషయంలో కూడా ఈ రెండు సంస్థల మధ్య ఇంకా ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదని కూడా చెప్పవచ్చు. వాస్తవానికి, ఈ పెట్టుబడి గురించి వస్తున్న వార్తల పైన ఇటు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి కానీ, అటు  బైట్ డాన్స్ నుండి కానీ, ఇంకా ఎటువంటి అధికారికంగా స్పందన మాత్రం రాలేదు.

జూన్ నెలల్లో చైనా – భారత్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో "సార్వభౌమాధికారం మరియు సమగ్రత" కు అపాయం కలిగించినందుకు టిక్ టోక్ మరియు వీచాట్ సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. దీని తరువాత, అనేక ఇతర యాప్స్ కూడా ఇండియాలో నిషేధించబడ్డాయి. కేవలం, ఇండియా మాత్రమే కాదు చాలా దేశాలలో ఈ యాప్స్ పైన కొంత నిరసన వచ్చింది.    

గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు చెందిన మెసేజింగ్ యాప్ వీచాట్, టిక్‌ టాక్ యజమానులతో అమెరికా లావాదేవీలపై నిషేధాన్ని వెల్లడించారు, ఇది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. అమెరికాలో టిక్ ‌టాక్ ‌ను ఇంకా నిషేధించనప్పటికీ, ఇది ఖచ్చితంగా చర్చలో ఉంది, అమెరికాలో టిక్‌ టాక్ నిషేధించబడుతోందని కూడా చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo