నిజంగా PUBG MOBILE చైనా యాప్ అవునా, కాదా ? అసలు నిజం ఏమిటి?

Updated on 11-Jun-2020
HIGHLIGHTS

భారత్, చైనా సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా,ప్రజలు చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తున్నారు.

PUBG MOBILE అనేది చైనీస్ యాప్ అవునా, కాదా అనే ప్రశ్న ప్రజల మనస్సులలో తలెత్తుతోంది.

ప్రజలు తమ ఫోన్ల నుండి చైనీస్ తయారీ చేసిన యాప్స్ తొలగిస్తున్నారు మరియు వాటిని స్తానాన్ని భర్తీ చేయగల యాప్స్ కోసం చూస్తున్నారు.

భారత్, చైనా సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా,ప్రజలు చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తున్నారు. ఈ బహిష్కరణ ప్రభావం మొబైల్ ఫోన్లలో కనిపించే యాప్స్ పైన కూడా చూడవచ్చు. ప్రజలు తమ ఫోన్ల నుండి చైనీస్ తయారీ చేసిన యాప్స్ తొలగిస్తున్నారు మరియు వాటిని స్తానాన్ని భర్తీ చేయగల యాప్స్ కోసం చూస్తున్నారు. మనం  టిక్‌టాక్ మొదలైన యాప్స్ గురించి మాట్లాడితే, అది చైనీస్ యాప్ అని మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితిలో, PUBG MOBILE అనేది చైనీస్ యాప్ అవునా, కాదా అనే ప్రశ్న కూడా ప్రజల మనస్సులలో తలెత్తుతోంది.

PUBG MOBILE అంటే ఏమిటి?

PUBG అనేది బాటిల్ రాయల్ గేమ్, ఇది PC మరియు గేమింగ్ కన్సోల్స్ కోసం 2017 లో ప్రారంభించబడింది. ప్రారంభించిన కొద్దికాలానికే, PUBG ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ వీడియో గేమ్స్ లో ఒకటిగా మారింది. ఈ ఆటలో 100 మంది ఆటగాళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడవచ్చు మరియు చివరికి మిగిలిన ఆటగాడు PUBG లో చికెన్ డిన్నర్ అందుకుంటాడు. PUBG బ్యాగ్గౌండ్ లో పనిచేసిన Brendan Green, ARMA 2 మరియు Day Z: బాటిల్ రాయల్ వంటి మరింత ప్రజాదరణ పొందిన గేమ్స్ ను కూడా తయారు చేశాడు.

PUBG MOBILE యొక్క మూలం దేశం

కొరియా గేమ్ మేకర్ Bluehole యొక్క అనుబంధ సంస్థ అయిన PUBG కార్పొరేషన్ ఈ ఆటను PC  కోసం సృష్టించింది. చైనా గేమింగ్ మార్కెట్లోకి ప్రవేశించడానికి కొరియా తయారీదారు చైనా యొక్క పెద్ద గేమింగ్ సంస్థ Tencent ‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ Tencent ద్వారా గేమ్ యొక్క మొబైల్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ గేమ్ వెంటనే చైనాలో ప్రముఖమైన గేమ్ గా మారింది. కానీ, చైనా ప్రభుత్వం దాని పైన డబ్బు ఆర్జనను అనుమతించలేదు.

చైనాలో PUBG MOBILE నిషేధించబడిందా?

అవును, చైనాలో ఈ గేమ్ నిషేధించబడింది ఎందుకంటే ఇది హింసకు పాల్పడేవిధంగా ఉన్నట్లు ప్రభుత్వం విశ్వసిస్తుంది మరియు ఇది యువతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని అక్కడి ప్రభుత్వం. నివేదిక ప్రకారం, ఈ ఆట కారణంగా, ప్రజలు తమ వృత్తిపై పూర్తిగా దృష్టి పెట్టలేరు అని కూడా చైనా ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆట యొక్క వ్యసనం నుండి యువతను రక్షించడానికి, అక్కడి ప్రభుత్వం దీనిని నిషేధించింది.

ఈ విధంగా, టెన్సెంట్ చైనాలో ఆటను రద్దు చేయవలసి వచ్చింది, కాని వారు ఈ గేమ్ యొక్క క్లోన్ వెర్షన్ అయిన PC కోసం ఆటను రూపొందించారు. నివేదిక ప్రకారం, PUBG MOBILE యొక్క ఈ క్లోన్ వెర్షన్ ఒక పెట్రియాటిక్ గేమ్‌గా అంచనా వేయబడింది, తద్వారా చైనా ప్రభుత్వం ఈ యాప్ ని అనుమతించాల్సివచ్చింది   మరియు ప్రభుత్వం అలా చేసింది.

PUBG MOBILE చైనీస్ యాప్ ?

అవును, ఈ గేమ్ యొక్క మొబైల్ వెర్షన్ చైనీస్ కంపెనీ టెన్సెంట్ చేత సృష్టించబడింది మరియు ఇది చైనీస్ యాప్ అవుతుంది. ఏదేమైనా, ఈ గేమ్ యొక్క అసలు యాజమాన్య దేశం మాత్రం చైనా కాదు. వాస్తవానికి, ఈ ఆటను కొరియన్ గేమింగ్ సంస్థ Bluehole సృష్టించింది. Bluehole మరియు Riot Games , Epic Games, Ubisoft, Activision Blizzard వంటి ఇతర గేమింగ్ సంస్థలతో టెన్సెంట్ 10 శాతం వాటాను కలిగి ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :