PUBG మొబైల్ తన బీతాలో ఒక కొత్త అప్డేట్ 0.11.5 ని అందించింది. ఈ అప్డేట్ చేసినవారికి, Vikendi మ్యాప్ లో G36C రీఫిల్ మరియు Sanhok మ్యాప్ లో ఆటో రిక్షా వచ్చి చేరతాయి. అంతేకాకుండా, Erangel మరియు Miramar మ్యాప్ లకు డైనమిక్ వాతావరణం వంటికి కూడా జతచేయబడ్డాయి. ఇక రెసిడెంట్ ఈవిల్ కి "Survive Till Dawn" అట మోడ్ కూడా జత చేయబడింది.
అధనంగా, ప్లేయర్ బలహీనపడినపుడు వచ్చే జోమ్బిలు ఆట సమయంలో సరైన సమయలో వస్తుంటాయి మరియు మ్యాప్ లో జోమ్బిలు ఎంటర్ కానీ కొన్ని ప్రాంతాలని కూడా సరిచేసారు. అలాగే, Vikendi మ్యాప్ కి మూన్ లైట్ (వెన్నెల) ని కూడా జతచేశారు. ముఖ్యంగా, బడ్జెట్ డివైజెస్ లో వచ్చే ఇబ్బందులకు కారణమయ్యే డిస్ప్లే బగ్స్ ని కూడా సరిచేశారు. అంటే, ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో కూడా గ్రాఫిక్స్ బాగానే ఉంటాయన్నమాట.
ఇక చివరగా, Resident Evil 2 యొక్క ప్రధాన మెనూ యొక్క థీమ్ మరిము మ్యూజిక్ ని కూడా కొత్తగా జతచేశారు. ఇంకా కొన్ని ప్లేయర్ స్పెస్ లను కూడా జతచేసి అందించారు.
వాస్తవానికి, ఈ గేమ్ తన అత్యధికమైన గ్రాఫిక్స్ మరియు నిజాన్ని తలపించేలా చూపించే ఆటతీరు మరియు గన్స్ అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా చాల మందిని ఈ ఆటకే అతుక్కుపోయేలా చేసింది. కానీ, మనం గమనించాల్సిన విషయం ఈ ఆట అనేది కేవలం మనకు టైం పాస్ చేయడానికి ఉపయోగ పడే ఒక సాధనంగా మాత్రమే చూడాలి తప్ప, దీని బానిసలుగా మారకూడదు. ఇండియాలో దీన్ని చాల చోట్ల బ్యాన్ కూడా చేశారు.