ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాధారణ పొందిన ఈ గేమ్ ముందుగా నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్ షిప్ యొక్క ఫైనల్ ని దుబాయ్ లో నిర్వహించింది. అయితే, ప్రస్తుతం ఇండియాలో నిర్వహస్తున్న PUBG మొబైల్ ఇండియా సిరీస్ 2019 ఫైనల్ కి వేదికగా మాత్రం హైదరాబాద్ నగరం నిలచింది. అంతేకాదు, ఈ గేమ్ ఫైనల్ నిర్వహించడానికి హైదరాబాద్ నగరంలోనే ఒక ఆడిటోరియంను ఎంచుకున్నారు.
ఈ పోటీ మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి (1PM) మొదలయ్యింది. ఈ పోటీకోసం 2,000 జట్లు ఎంపిక చేయబడ్డాయి. ఈ ఎంపిక చేయబడిన 2000 జట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 20 జట్లు ఫైనల్లో తలపడ్డాయి. అయితే, ఈ ఫైనల్లో పోటీపడిన 20 టీమ్స్ లో కూడా టీం SOUL అద్భుతమైన గేమ్ ప్లే అందించారు. ఇక వారిని లైవ్ లో చూస్తున్న వారికీ కూడా మంచి ప్రదర్శన ఇచ్చారని చెప్పాలి. ఈ టీంలో వున్న నలుగురు ఆటగాళ్లు కలిసి మొత్తంగా 46 Kills తో ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఇక మిగిలి రెండు మూడు స్థానాలకు గాను, GOD'S REIGN 39 Kills సాధించి రెండవ స్థానాన్ని సొంతం చేసుకోగా, 23 Kills సాధించి FUNKY MONKEY మూడవ స్థానంలో నిలచింది. వీటితో పాటుగా ఎక్కువగా Kills సాధించిన ఆటగాళ్ల కు కూడా విడిగా ప్రైజ్ మనీ ప్రటించారు. మొదటి మొదటి టీం 30,00,000 ని ప్రైజ్ మనీగా అందుకోగా, రెండవ స్థానంలో నిలచిన వారు 10,00,000 రూపాయాలు అందుకున్నారు మరియు మూడవ స్థానంలో వున్నవారికి 5,00,000 రూపాయల ప్రైజ్ మనీ దక్కింది.